మేడారం హుండీ లెక్కింపు పూర్తి

by Ratna Kumari |

మేడారం సమ్మక్క, సారలమ్మ హుండీల లెక్కింపు పూర్తయింది. మేడారం ఆదాయం భక్తుల కానుకల రూపంలో 13కోట్ల 51లక్షల 76వేల 275 రూపాయలు వచ్చాయి.

మేడారం హుండీ లెక్కింపు పూర్తి
X

దిశ, వరంగల్ బ్యూరో : మేడారం సమ్మక్క, సారలమ్మ హుండీల లెక్కింపు పూర్తయింది. మేడారం ఆదాయం భక్తుల కానుకల రూపంలో 13కోట్ల 51లక్షల 76వేల 275 రూపాయలు వచ్చాయి. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఈనెల 5న లెక్కింపు ప్రారంభించిన అధికారులు గురువారం పూర్తి చేశారు. మొత్తం 828 హుండీల లెక్కింపు చేశారు. మొత్తం 8 రోజుల పాటు ఈ లెక్కింపును చేపట్టారు. 780 హుండీలు, 45 బ్లాక్ హుండీలు, 3 రైస్ హుండీలు కలిపి 828 హుండీలను లెక్కించారు. డబ్బులతో పాటు 486.500 గ్రాముల బంగారం, 31 కిలో 700 గ్రాముల వెండి కూడా కానుకల రూపంలో వచ్చినట్టు అధికారులు తెలిపారు.

Next Story