భారీగా నల్లబెల్లం పట్టివేత

by Elthuri vijay kumar |

నెల్లికుదురు మండల పోలీసులు భారీగా నల్ల బెల్లాన్ని పట్టుకున్నారు.

భారీగా నల్లబెల్లం పట్టివేత
X

భారీగా నల్లబెల్లం పట్టివేత

ట్రాలీ, ద్విచక్ర వాహనం స్వాధీనం

ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు

దిశ, మహబూబాబాద్: నెల్లికుదురు మండల పోలీసులు భారీగా నల్ల బెల్లాన్ని పట్టుకున్నారు. శుక్రవారం పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో మేచరాజుపల్లి గ్రామ శివారు వద్ద అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న ట్రాలీని తనిఖీ చేయగా అందులో ఉన్న 60 బస్తాల్లో సుమారు 30 క్వింటాళ్ల నల్లబెల్లం, 2 బస్తాల పటికను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై రమేష్ బాబు తెలిపారు. అలాగే ట్రాలీ ఆటో, బైక్ ను స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

Next Story