- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Fire Accident : వరంగల్ లో భారీ అగ్నిప్రమాదం... కాలి బూడిదైన 30 ఎకరాల పంట
వరంగల్(Warangal) లో జరిగిన భారీ అగ్నిప్రమాదం(Fire Accident) ఓ రైతును కన్నీటి శోకంలో ముంచింది.

దిశ, వెబ్ డెస్క్ : వరంగల్(Warangal) లో జరిగిన భారీ అగ్నిప్రమాదం(Fire Accident) ఓ రైతును కన్నీటి శోకంలో ముంచింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనా వివరాలు ఈ విధంగా ఉన్నాయ్.. వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రం నుంచి మొగిలిచర్ల వెళ్ళే దారిలో ఓ రైతు తన చేనులో ఎండిన మొక్కజొన్న చొప్పను తగలబెట్టాడు. ఆ మంటలు కాస్త వేగంగా వ్యాపించి పక్కనే ఉన్న మిగతా చేన్లకు వ్యాపించాయి. అయితే ఆ చేలల్లో ఆరబెట్టిన 30 ఎకరాల పంట చూస్తుండగానే కాలి బూడిద అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
చివరకు మరో రెండు ఫైర్ ఇంజన్లను రప్పించి మంటలు అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి కారణం అయిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తాము ఆరుగాలం కష్టపడి పెంచిన పంట, ఇక చేతికి వస్తుందనుకున్న సమయంలో.. తమ ముందే పంట కాలిపోవడంతో రైతులు కన్నీళ్ళు పెట్టుకున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.






