- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శోక సంద్రంలో గంగదేవిపల్లి
గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ప్రదాత అకాల మరణంతో గంగదేవిపల్లి గ్రామ ప్రజలు ,వివిధ పార్టీల నాయకులు కంట నీరు గార్చి శోక సంద్రంలో మునిగిపోయారు.

దిశ , గీసుకొండ : గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ప్రదాత అకాల మరణంతో గంగదేవిపల్లి గ్రామ ప్రజలు ,వివిధ పార్టీల నాయకులు కంట నీరు గార్చి శోక సంద్రంలో మునిగిపోయారు. గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి ఆదివారం గుండె పోటుతో అకాల మరణం పొందారు. ఈ సందర్భంగా పలువురు నేతలు నివాళులు అర్పించారు. రాజమౌళి మహోన్నతమైన వ్యక్తి అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. కూసం రాజమౌళి మహోన్నతమైన వ్యక్తి అని.. ఆయన లేని లోటును ఎవ్వరు తీర్చలేరని పేర్కొన్నారు.
పట్టువీడని కార్యసాధకుడు
కూసం రాజమౌళి పట్టువీడని కార్యసాధయకుడు అని ఇలా అకాలమరణం చెందడం చాలా బాధాకరమని అన్నారు. రాజమౌళి నిత్య శ్రామికుడు అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్ వెస్లీ , జి నాగయ్య అన్నారు. పార్టీ బలోపేతానికి, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన అభ్యుదయ భావాలు యువతను మోల్కొలిపే రీతిలో ఉండేవని, నిత్య శ్రామికుడని తెలిపారు. ఆర్డీవో సుమ, ఎమ్మార్వో రియాజోద్దీన్, కాంగ్రెస్ నాయకులు అల్లం బాల కిషోర్ రెడ్డి, పలువురు నేతలు నివాళులర్పించారు.






