మానుకోట ప్రతిఘటన భావితరాలకు స్ఫూర్తి

by Ratna Kumari |

మానుకోట ఘటన తెలంగాణ ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిందని తెలంగాణ ఉద్యమ నేత శంతన్ రామరాజు అన్నారు. ఘటనకు 16 ఏళ్లు పూర్తైన సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్‌లో మానుకోట రాళ్లను ప్రదర్శిస్తూ నాటి ఉద్యమాన్ని స్మరించుకున్నారు.

మానుకోట ప్రతిఘటన భావితరాలకు స్ఫూర్తి
X

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : మానుకోట ఘటన తెలంగాణ ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిందని తెలంగాణ ఉద్యమ నేత శంతన్ రామరాజు అన్నారు. ఘటనకు 16 ఏళ్లు పూర్తైన సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్‌లో మానుకోట రాళ్లను ప్రదర్శిస్తూ నాటి ఉద్యమాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమానికి మానుకోట ప్రతిఘటన ఊపిరి పోసిందన్నారు. ఉద్యమకారులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుంజె హన్మంతు, బాధరబోయిన రాఘవులు, తూము వెంకన్న, భూక్య సత్యనారాయణ, ముత్తుదొర వంటి ఉద్యమకారులు ప్రభుత్వ గుర్తింపు లేకుండానే మరణించడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉద్యమకారుల గుర్తింపు కమిటీ త్వరగా పనులు పూర్తి చేసి ప్రతి ఉద్యమకారునికి గుర్తింపు, గౌరవ భృతి కల్పించాలని కోరారు. ప్రతి ఏడాది మానుకోట ఘటనను స్మరించుకునేలా కార్యక్రమాలు నిర్వహించి భవిష్యత్ తరాలకు తెలంగాణ పోరాట స్ఫూర్తిని అందించాలని పిలుపునిచ్చారు.

Next Story