- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానుకోట హాస్త గతం.. కొలువు తీరిన పాలక వర్గం..!
ఉత్కంఠ.. లాబీయింగ్..రిసార్ట్ రాజకీయాలు.. చివరి నిమిషం వరకూ సాగిన వ్యూహాలు.. ఇలా హైడ్రామా మధ్య సాగిన మానుకోట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది.

దిశ, మహబూబాబాద్ : ఉత్కంఠ.. లాబీయింగ్..రిసార్ట్ రాజకీయాలు.. చివరి నిమిషం వరకూ సాగిన వ్యూహాలు.. ఇలా హైడ్రామా మధ్య సాగిన మానుకోట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. రాజకీయ సమీకరణాల్లో చివరి క్షణం వరకూ ఉత్కంఠ నెలకొనగా, స్వతంత్రురాలు కాంగ్రెస్ జెండా కప్పుకోవడం తో గుగులోత్ జ్యోతి చైర్మన్ పదవినీ దక్కించుకున్నారు. వైస్ చైర్మన్‌గా సీపీఎం సూర్నపు సోమయ్య బాధ్యతలు స్వీకరించారు.
మ్యాజిక్ ఫిగర్ కోసం ముమ్మర పోరు.!
మొత్తం 36 వార్డులున్న మానుకోట మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 19. అయితే కాంగ్రెస్ 13, సీపీఎం 3, స్వతంత్రులు 4, కాంగ్రెస్ కు ఎక్స్ అఫిషియోగా ఎమ్మెల్యే మురళీ నాయయక్ ఓటు కలవడంతో బలం 21కు చేరింది. మ్యాజిక్ ఫిగర్ దాటి చైర్మన్ పదవీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 11 బీ ఫామ్ ఆలస్యంతో స్వతంత్రంగా గెలిచిన కౌన్సిలర్ రజిత తరువాత బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడంతో వారి సంఖ్య 12 ఉండగా.. సీపీఐ బీజేపీ సభ్యురాలు మద్దతుతో 16కి చేరింది. ఎమ్మెల్సీ రవీందర్ రావు ఎక్స్ అఫిషియో ఓటు కలిపి మొత్తం 17 ఓట్లు సాధించింది.
స్వతంత్రురాలికి వరించిన అదృష్టం..“దిశ” అంచనా నిజం!
మానుకోట మున్సిపాలిటీలో స్వతంత్రులే కింగ్ మేకర్స్ అవుతారని “దిశ” ముందుగానే విశ్లేషించింది. అధికార కాంగ్రెస్ సైతం స్వతంత్రులకే చైర్మన్ ఇవ్వబోతుందంటూ కథనం కూడా ప్రచురించింది. అదే సత్యమై, చివరకు స్వతంత్రురాలికే చైర్మన్ పదవి దక్కడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.






