- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడల్ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి సీతక్క
by Bhanu |
మండల కేంద్రంలో నిర్మించిన అధునాతన మోడల్ పోలీస్ స్టేషన్ ను మంత్రి సీతక్క సోమవారం ప్రారంబించారు.

X
దిశ, మంగపేట : మండల కేంద్రంలో నిర్మించిన అధునాతన మోడల్ పోలీస్ స్టేషన్ ను మంత్రి సీతక్క సోమవారం ప్రారంబించారు. జిల్లా ఎస్పీ శబరీష్, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాద్యాయ, సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై టీవీఆర్.సూరీలతో కలిసి నూతన భవన ప్రారంభానికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి సీతక్క గుమ్మడికాయ దిష్టి తీసి రిబ్బన్ కట్ చేశారు.
నూతన భవనంలోని పలు విభాగాలకు చెందిన రూములలో పూజలు నిర్వహించి స్టేషన్ ఎస్ హెచ్ వో టీవీఆర్. సూరీని కుర్చీలో కూర్చోబెట్టి శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Next Story






