- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'మనల్ని ఎవడ్రా ఆపేది'.. మైనర్ లకు మద్యం విక్రయాలు..?
మండలంలో మూడు వైన్ షాపులు సిండికేట్ గా నిబంధనలకు తూట్లు పొడుస్తూ కచ్చితమైన పద్ధతులు పాటించకుండా మద్యం వ్యాపారం సాగిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ, బయ్యారం : మండలంలో మూడు వైన్ షాపులు సిండికేట్ గా నిబంధనలకు తూట్లు పొడుస్తూ కచ్చితమైన పద్ధతులు పాటించకుండా మద్యం వ్యాపారం సాగిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ షాపులు గడువు దాటిన బీర్ సీసాలను ఎక్స్ పైరీ డేట్ దాటినా నిర్భయంగా విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. మద్యం దారులు ఈ పరిస్థితిని ప్రాణహానికీ దారి తీసే ప్రమాదంగా అభివర్ణిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కనకదుర్గ వైన్ షాప్ వద్ద 18 ఏళ్లు నిండని మైనర్ బాలుడు స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు.
ప్రభుత్వ, అబ్కారీ శాఖ నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా జరుగుతున్న ఈ సంఘటనలు స్థానికులకు ఆందోళన కలిగిస్తున్నాయి. సంబంధిత అధికారులు ఈ సిండికేట్ షాపుల అక్రమ చర్యలపై ఎలాంటి స్పందన లేకుండా ఉండటంతో అనుమానాలు పెరుగుతున్నాయి. స్థానికులు వెంటనే అధికారులు మేల్కొని కఠిన చర్యలు తీసుకుని, సిండికేట్ వైన్ షాపులపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.






