- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ వైర్లు తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలు
by velandi.Saikiran |
ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ తగిలి ఓ వ్యక్తికి తీవ్రమైన గాయాలైన సంఘటన చోటుచేసుకుంది.

X
దిశ, కేసముద్రం : ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ తగిలి ఓ వ్యక్తికి తీవ్రమైన గాయాలైన సంఘటన కేసముద్రం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం, నారాయణపురం గ్రామ పంచాయతీ శివారులోని బోడగుట్ట తండాలో గుగులోత్ యాకూబ్(32) అనే వ్యక్తికి విద్యుత్ వైర్లు తగిలి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అతని పరిస్థితి విషమంగా ఉంది. నిన్ననే 11 కేవీ విద్యుత్ వైర్లు తెగిపడి నేలపై పడ్డాయని, ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు గ్రామస్థులు. అంతలోనే యాకూబ్ సంఘటన జరిగిందని పేర్కొంటున్నారు. దీనికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story






