- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వన్ ప్లస్ నకిలీ పరికరాలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్..
by Kodari Anjali |
వన్ ప్లస్ నకిలీ పరికరాలు విక్రయిస్తున్న షాపుపై పోలీసులు రైడ్ చేసి ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.

X
దిశ, కార్వాన్: వన్ ప్లస్ నకిలీ పరికరాలు విక్రయిస్తున్న షాపుపై పోలీసులు రైడ్ చేసి ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి భారీ మొబైల్ పరికరాలు స్వాధీనం చేసుకున్న ఘటన అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. జగదీష్ మార్కెట్లోని పటేల్ మొబైల్ షాపులో వన్ ప్లస్ నకిలీ పరికరాలు అమ్ముతున్నారనీ, వన్ ప్లస్ కంపెనీ ప్రతినిధి నాగేశ్వర్ రావు ఫిర్యాదు మేరకు టాస్క్ ఫోర్స్, అబిడ్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి, రామ్ చౌదరి అనే వ్యక్తినీ అదుపులోకి తీసుకున్నారు. 12 లక్షలు విలువ చేసే నకిలీ వన్ ప్లస్ నెక్ బ్యాండ్స్, ఇయర్ పాడ్స్, ఛార్జర్లు, ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్లు, ఇయర్ బడ్స్, పరికరాలను సీజ్ చేసి, రామ్ చౌదరిపై కాపీ రైట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Next Story






