- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడిసెలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి
స్టేషన్ ఘనపూర్ ను ఫైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని గుడిసెలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కడియం శ్రీహరి అన్నారు.

దిశ ధర్మసాగర్: స్టేషన్ ఘనపూర్ ను ఫైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని గుడిసెలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ..... ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి అర్హులైన కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించడమే లక్ష్యమని వెల్లడించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని 7మండలాలు, స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలో ప్రస్తుతం గుడిసెల్లో, కవర్లు కప్పిన పెంకుటిళ్ళల్లో, రేకుల షెడ్లలో నివసిస్తున్న వారితో పాటు అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్న పేద కుటుంబాలకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. ఎంపిక ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిజమైన అర్హులను గుర్తించాలన్నారు. మొదటి విడతలో చేసిన సర్వేలలో చాలా పొరపాట్లు జరిగాయాని అలాంటి పొరపాట్లు మళ్ళీ పునరావృతం కావద్దని సూచించారు.
ఈ మధ్య మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మార్క్ చేయని ఇళ్లు, మార్క్ చేసినప్పటికీ ఇంకా నిర్మాణాలు ప్రారంభం కాని ఇళ్ల వివరాలను వెంటనే అందజేయాలని అధికారులను ఆదేశించారు. రెండో విడతలో వచ్చిన 2000 ఇందిరమ్మ ఇండ్లలో 500 గతంలో మంజూరు అయి అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్లను పూర్తి చేసేందుకు కేటాయించినట్లు తెలిపారు. కాబట్టి లబ్ధిదారుల ఎంపికలో జాగ్రత్తలు పాటిస్తూ అసంపూర్తిగా ఉన్న ఇంటి నిర్మాణం ఏ స్థాయిలో ఉంది....? ఎంత ఖర్చు అవుతుంది...? అనే అంచనాలను ఖచ్చితంగా వేసి లబ్ధిదారులకు అండగా నిలవాలని పేర్కొన్నారు.






