వడ దెబ్బతో వ్యక్తి మృతి...

by Bhanu |

వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అపరాజు పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

వడ దెబ్బతో వ్యక్తి మృతి...
X

దిశ, గూడూరు: వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అపరాజు పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అప్పరాజుపల్లి గ్రామానికి చెందిన మండల సర్వయ్య (55) భార్య అన్నపూర్ణతో కలిసి శనివారం రోజున ఉపాధి హామీ పనికి వెళ్ళాడు అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు ముగించుకొని ఇంటికి వచ్చాక అస్వస్థతకు గురయ్యారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత పెరుగుతో భోజనం చేసి పడుకున్నాడు. ఆదివారం ఉదయం భర్త లేవకపోవడంతో గమనించిన భార్య ఎంతకు లేవకపోవడంతో చుట్టుపక్కల వారు ఇంటికి చేరుకొని నిద్ర లేపే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందాడు అని తెలిపారు. భార్య అన్నపూర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




Next Story