- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాలీ వెనుక టైర్ పగలడంతో వ్యక్తి మృతి
సంతోషంగా మేడారం వెళ్తున్న పలు కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం విషాదం నింపింది.

దిశ, నర్సంపేట: సంతోషంగా మేడారం వెళ్తున్న పలు కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. ట్రాలీ టైర్ పగలడంతో సుమారు 23మందితో వెళ్తున్న వాహనం ఒక్కసారిగా జాతీయ రహదారి నుండి పక్కకు వెళ్లి బోల్తా పడింది. సూర్యాపేట జిల్లా వేములపల్లి గ్రామానికి చెందిన పలువురు ములుగు జిల్లా మేడారానికి గురువారం వేకువజామున బయలుదేరారు. నర్సంపేట మండలం ముత్తోజీపేట గ్రామం దాటే క్రమంలో అశోక్ లే ల్యాండ్ ట్రాలీ వాహనం వెనుక టైర్ ఒత్తిడికి పగిలిపోయింది. ఈ క్రమంలో డ్రైవింగ్ అదుపు తప్పి చర్చికి ఎదురు వైపుగా డ్రైనేజీ దాటి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. స్పందించిన స్థానికులు సహాయ చర్యలు చేపట్టారు. వాహనంలో ఉన్న చీమల. అంజయ్య అనే వ్యక్తి పరిస్థితి విషమించి మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. వీరిని ఖమ్మం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై అరుణ్ తెలిపారు.






