మల్లూరువాగు ప్రాజెక్టుకు జలకళ.. మరో 2 మీటర్ల వరద చేరితే

by Bhanu |

మండలంలోని నర్సింహాసాగర్ మల్లూరువాగు మధ్యతరహా ప్రాజెక్టులో జలకళ సంతరించుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువలోని గుట్టల నుం

మల్లూరువాగు ప్రాజెక్టుకు జలకళ.. మరో 2 మీటర్ల వరద చేరితే
X

దిశ, మంగపేట : మండలంలోని నర్సింహాసాగర్ మల్లూరువాగు మధ్యతరహా ప్రాజెక్టులో జలకళ సంతరించుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువలోని గుట్టల నుండి వచ్చిన వరదనీరు ప్రాజెక్టులోకి చేరడంతో రిజర్వాయర్ 113.50 మీటర్ల సామర్థ్యంతో నిండి జలకళతో ఉట్టిపడుతుంది. మల్లూరు వాగు ప్రాజెక్ పూర్తి స్థాయి నీటి మట్టం 115.25 మీటర్లు కాగా ప్రస్తుతం 113.30 మీటర్ల నీటి సామర్థ్యంతో నిండగా మరో 2 మీటర్ల వరద చేరితే మత్తడి పడే అవకాశం ఉంది.

ప్రాజెక్టులోకి 0.990 టిఎంసీల ఇన్ ఫ్లో వరద ప్రాజెక్టులోకి రావడంతో 367.382 క్యూసెక్కుల సర్ ప్లస్ నీటి నిలువలు ఉన్నట్లు ఇరిగేషన్ ఏఈ వలీం మహ్మద్ తెలిపారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల పరిధిలోని సుమారు 4 వేల యకరాల ఆలయకట్టులోని రైతాంగానికి ఖరీఫ్, రబీ పంటలకు సాగునీరు అందనున్నది.

Next Story