రజతోత్సవ సభను జయప్రదం చేయండి

by Naveena |

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని చింతలపల్లి వద్ద బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ పనులను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గురువారం పరిశీలించారు.

రజతోత్సవ సభను జయప్రదం చేయండి
X

దిశ, ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని చింతలపల్లి వద్ద బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ పనులను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గురువారం పరిశీలించారు. పార్కింగ్, తాత్కాలిక అంబులెన్స్ , 20 పడకల హాస్పిటల్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజలను వంచిస్తోందని మాజీ మంత్రి ఆరోపించారు. ప్రజలు స్వచ్ఛందంగా బహిరంగ సభ కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సభకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లు సతీష్ బాబు తెలిపారు. పది లక్షల నీళ్ల సీసాలు, పది లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందించేందుకు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పిట్టల మహేందర్, తంగేడ మహేందర్, తంగేడ నగేష్, కడారి రాజు, గోల్లే మహేందర, సూరంపల్లి పరశురాం, గుండేటి సతీష్ నేత, కొమ్మిడి మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story