విద్యుత్ షాక్ తో మొక్కజొన్న పంట దగ్ధం

by Nallavelli.Anjaneyulu |

మండలంలోని కోయగూడెం పంచాయతీ పరిధిలో చేతి కాడికి వచ్చిన మొక్కజొన్న పంట గాలి దుమారానికి విద్యుత్ షాక్ తో దగ్ధమైనట్టు సర్పంచ్ లింగ్యా నాయక్ శుక్రవారం తెలిపారు.

విద్యుత్ షాక్ తో మొక్కజొన్న పంట దగ్ధం
X

దిశ‌, బ‌య్యారం : మండలంలోని కోయగూడెం పంచాయతీ పరిధిలో చేతి కాడికి వచ్చిన మొక్కజొన్న పంట గాలి దుమారానికి విద్యుత్ షాక్ తో దగ్ధమైనట్టు సర్పంచ్ లింగ్యా నాయక్ శుక్రవారం తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. పూసం నాగేందర్ బాబు ఎకరం, పూసమ్ లక్ష్మయ్య ఎకరం, పూసం ఎర్రయ్య ఎకరం, భూక్య పెద్ద నరసింహ ఎకరం మొక్కజొన్న పంట పొలాల్లో కంకులు విరిసి పొలంలో ఉండగా.. గురువారం ఒక్కసారిగా వచ్చిన ఈదురు గాలికి పక్కనే ఉన్న విద్యుత్ తీగలు ఒకదానికొకటి షార్ట్ సర్క్యూట్ తో నిప్పురవ్వలు లేచి మొక్కజొన్న పంటపై పడి నలుగురి రైతుల పంట నాలుగు ఎకరాలలో దగ్ధమైనట్లు తెలిపారు. దగ్ధమైన పంట పొలాలను ఏఈఓ ఫయాజ్ పరిశీలించి, రైతులకు ధైర్యం కల్పించారు. ప్రభుత్వం నుంచి ఏమైనా ఆర్థిక సహయం వస్తే.. వాటిని వచ్చే విధంగా కృషి చేస్తానని బాధిత రైతులకు హామీ ఇచ్చారు.

Next Story