ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే మురళి నాయక్ కృతజ్ఞతలు..

by Bhanu |   (  Updated:2025-06-13 09:47:27  IST  )

మహబూబాబాద్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే డా. భూక్యా మురళి నాయక్ అభ్యర్థన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి భారీ నిధులు మంజూరు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే మురళి నాయక్ కృతజ్ఞతలు..
X

దిశ, మహబూబాబాద్ టౌన్ : మహబూబాబాద్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే డా. భూక్యా మురళి నాయక్ అభ్యర్థన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి భారీ నిధులు మంజూరు చేశారు. ఇటీవల నూతనంగా ఏర్పాటైన కేసముద్రం మున్సిపాలిటీకి 100 కోట్లు, మహబూబాబాద్ మున్సిపాలిటీకి 50 కోట్లు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. ఈ నిధుల మంజూరులో ముఖ్యమంత్రి ప్రభుత్వ సలహాదారు వేం. నరేందర్ రెడ్డి కీలకపాత్ర పోషించారు.


దీంతో ఎమ్మెల్యే భూక్యా మురళి నాయక్ ఆయనకు శాలువా కప్పి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా, మహబూబాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించి కూడా సీఎం దృష్టికి ఎమ్మెల్యే అంశాన్ని తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వ సలహాదారు వేం. నరేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే దీనికి అనుమతులు మంజూరవుతాయని హామీ ఇచ్చారు.

Next Story