- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ మొదలైన స్థానిక సందడి
వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండడంతో అధికారులు కూడా సన్నద్ధమవుతున్నారు. పంచాయతీ

మళ్లీ మొదలైన స్థానిక సందడి
=గ్రామ పంచాయతీ ఎన్నికలకు కసరత్తు
=పోటీకి సిద్ధమవుతున్న పార్టీల నేతలు
=ఇద్దరు పిల్లల నిబంధనలను ఎత్తివేత
=సర్పంచ్ పదవులకు పెరగనున్న పోటీ
=ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
దిశ, వరంగల్ బ్యూరో: ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామాల్లో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికలు నిర్వహిస్తామని కేబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులు రెండు రోజుల క్రితం ప్రకటించడంతో గ్రామాల్లో పార్టీల నేతలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనలను ప్రభుత్వం ఎత్తివేయడంతో సర్పంచ్ పదవులకు పోటీ పెరగనుంది. సీఎం ప్రకటనతో స్థానిక సంస్థల ఎన్నికలకు ఊపు వచ్చింది. పోటీకి సిద్ధమవుతున్న నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో రిజర్వేషన్లకు అనుగుణంగా పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొత్త రిజర్వేషన్లకు అనుగుణంగా ఎన్నికలకు సిద్ధమవుతుండటంతో అధికారులు కూడా మళ్లీ ఈ ఎన్నికల కోసం ఏర్పాట్లలో నిమగ్నం అవుతున్నారు.
ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత..
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని రెండు రోజుల క్రితం మంత్రులు ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతల్లో ఊపు వచ్చింది. మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించి తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహిస్తామని ప్రకటించడంతో ఆ దిశగా పోటీకి సిద్ధమవుతున్నారు. గత రిజర్వేషన్లు కూడా మారే అవకాశం ఉండటంతో ఎక్కువ మంది పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇద్దరు పిల్లల నిబంధనలను కూడా ప్రభుత్వం ఎత్తి వేయడంతో పంచాయతీ ఎన్నికలు రసవత్తరం కానున్నాయి. పోటీ చేసే నేతల సంఖ్య పెరగనుంది.
డిసెంబర్లో నోటిఫికేషన్..
స్థానిక సంస్థల ఎన్నికలకు గత నెలలో నోటిఫికేషన్ ఇచ్చారు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. నామినేషన్లు తీసుకునే సమయంలోనే బీసీ రిజర్వేషన్లపై కోర్టు స్టే ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ ఎన్నికలను నిలిపివేసింది. ప్రభుత్వ నిర్ణయం కోసం చూస్తున్నారు. గ్రామాల్లో పాలకవర్గాలు లేక దాదాపు 18 నెలలు గడుస్తుంది. సర్పంచులు, ఉపసర్పంచులు లేకపోవడంతో కేంద్రం నిధులు రావడం లేదు. పాలకవర్గాలు లేక 20 నెలలు దాటితే కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోతాయి. ఆలోపే మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించి ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించనుంది. డిసెంబర్ లో మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉండటంతో గ్రామాల్లో రాజకీయ సందడి పెరుగుతుంది. రిజర్వేషన్లు మారడం, ఇద్దరు పిల్లల నిబంధనలను ఎత్తివేయడం వల్ల ఎక్కువ మంది నేతలు పోటీకి సిద్ధమవుతున్నారు. గ్రామాల్లో కీలకంగా ఉండే సర్పంచ్ పదవులకు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వం హయాంలో నిర్వహించిన విధంగానే రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉండటంతో మాజీ ప్రజాప్రతినిధులు కూడా పోటీకి సన్నద్ధమవుతున్నారు.
పార్టీలు బీసీలకు 42 శాతం టిక్కెట్లు ఇస్తామని ప్రకటించినా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పార్టీ రహితంగా జరగనుండటంతో ఎక్కువ మందికి పోటీ చేసే అవకాశం ఏర్పడింది. పోటీ కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్ 42 శాతంకు అనుగుణంగా గత నోటిఫికేషన్ సమయంలో రిజర్వేషన్ ఖరారు చేయడంతో ఎక్కువ మంది పోటీకి దూరమయ్యారు. మళ్లీ ఇప్పుడు రిజర్వేషన్ మారే అవకాశం ఉండటంతో అన్ని పార్టీల నుంచి నేతలు పోటీకి సిద్ధమవుతున్నారు. భారీగా ఖర్చు పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గత నోటిఫికేషన్ ముందే చాలా మంది నేతలు గ్రామాల్లో ఉంటూ లక్షల రూపాయలు ఖర్చు చేశారు. రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో వదిలి వేశారు. ప్రస్తుతం రిజర్వేషన్లు మారనుండటంతో సర్పంచ్ ఎన్నికల కోసం ఎక్కువ మంది పోటీకి సిద్ధమవుతున్నారు.
ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు..
వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండడంతో అధికారులు కూడా సన్నద్ధమవుతున్నారు. పంచాయతీ ఎన్నికలనే ముందుగా నిర్వహిస్తామని ప్రకటించడంతో ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఓటరు లిస్ట్, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు సన్నద్ధం చేయడంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. ఎన్నికలపై ఉద్యోగులకు శిక్షణ కూడా ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఎన్నికల సంఘం నిర్ణయించగానే పోలింగ్ కు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను చేసేందుకు సిద్ధమవుతున్నారు. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల సంఘం ప్రకటించగానే ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడితే గ్రామాల్లో మళ్లీ రాజకీయ వేడి పెరగనుంది.






