నీ చుట్టూ ఉన్న వారంతా నా కోవర్టులే.. కడియం పై ఘాటైనా విమర్శలు చేసిన రాజయ్య

by Bhanu |

నీ తండ్రి చనిపోతే.. నువ్వు తలకొరివి పెడతానంటే మీ అమ్మ ఎందుకు నిరాకరించిందో చెప్పాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఘాటు విమర్శలు చేశారు.

నీ చుట్టూ ఉన్న వారంతా నా కోవర్టులే.. కడియం పై ఘాటైనా విమర్శలు చేసిన రాజయ్య
X

దిశ, లింగాలఘణపురం : నీ తండ్రి చనిపోతే.. నువ్వు తలకొరివి పెడతానంటే మీ అమ్మ ఎందుకు నిరాకరించిందో చెప్పాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఘాటు విమర్శలు చేశారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కడియం శ్రీహరి ఒక దళిత ద్రోహి అని, ఏనాడూ దళితుల కోసం మాట్లాడని కడియం శ్రీహరి దళిత సమ్మేళనానికి హాజరు కావడ సిగ్గుచేటు అన్నారు. దమ్ముంటే బైండ్ల సమ్మేళనం ఏర్పాటుచేసి వారికి ఏం చేశారో చెప్పాలన్నారు.


కడియం శ్రీహరి ప్రక్కన చేరిన వారు అంత నా కోవర్టులే అని అన్నారు. కేంద్ర మంత్రి పదవి ఇస్తామని అంటే కడియం శ్రీహరి, కూతుర్ని తీసుకొని బిజెపి పార్టీలో చేరుతాడన్నారు. పదవి లేకుండా కడియం శ్రీహరి బతకలేడని, అందుకు ఎవరినైనా మోసం చేస్తాడు అన్నారు. కేసీఆర్ ను నమ్మిచి మోసం చేసాడు, వచ్చే స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మా సత్తా చూపిస్తాం అన్నారు. రాజయ్య అంటే ప్రజానాయకుడు అని, మా దళిత బిడ్డలకు తెలుసు, నేనునిండా మునిగి ఉన్నానని నన్ను ఎవరు ఏం చేయలేరు అన్నారు.


తప్పుడు వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బస్వాగాని శ్రీనివాస్, నియోజకవర్గం మహిళా ఇంచార్జ్ భాగ్యమ్మ, బిఆర్ఎస్ శ్రేణులు చౌదరపెళ్లి శేఖర్, గండి యాదగిరి, ఎదునూరి వీరన్న,గట్టగల్ల శ్రీహరి, జనగాం విష్ణు, మబ్బు కర్ణాకర్, కేమిడి వెంకటేష్, సోమిరెడ్డి తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Next Story