విద్యుత్ షాక్ కి గురైన లైన్మెన్.. తీవ్ర గాయాలు

by Bhanu |

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని జమాల్‌పురం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

విద్యుత్ షాక్ కి గురైన లైన్మెన్.. తీవ్ర గాయాలు
X

దిశ, పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని జమాల్‌పురం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లైన్‌మన్ బాధవత్ బాలు విద్యుత్ మరమ్మత్తు పనులు చేస్తున్న సమయంలో అనుకోకుండా కరెంట్ సరఫరా కావడంతో తీవ్రమైన షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి.

వెంటనే స్థానికులు స్పందించి 108 అంబులెన్స్ ద్వారా బాలను వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించినట్టు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story