- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
K. A. Paul : రెడ్డి రాజ్యం పడకోడుదాం.. బీసీ రాజ్యాన్ని నిలబెడదాం..
రెడ్డి రాజ్యం పడకోడుదాం బీసీ రాజ్యాన్ని నిలబెడుదాం అని ప్రజా

దిశ,హనుమకొండ : రెడ్డి రాజ్యం పడకోడుదాం బీసీ రాజ్యాన్ని నిలబెడుదాం అని ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండ జిల్లా కేంద్రంలోని హరిత హోటల్ లో కేఏ పాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వరంగల్ లో మీట్ ది ప్రెస్ పెట్టకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడ్డుకున్నారు అని, రెడ్డి రాజ్యం పడకోడదం బీసీ రాజ్యాన్ని నిలబడదాం అని అన్నారు. ప్రజా శాంతి పార్టీ లో చేరండి 100రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తా అని, సదాశివపెటను అభివృద్ధి చేసినట్లు వరంగల్ ను కూడా అభివృద్ధి చేస్తా అన్నారు.
అవసరం ఐతే కేసీఆర్ తో కలిసి పనిచేస్తాం, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించండి 100 రోజుల్లో ఉచిత విద్య, వైద్యం అందిస్తా, సంవత్సరంలో నిరుద్యోగ సమస్యను నిర్ములిస్తా అని మాట్లాడారు. ప్రజల సొమ్మును కొల్లగొట్టిన వారిపై సీబీఐతో విచారణ చేపించి సొమ్మును ప్రజలకు పంచుతా అని, కడియం శ్రీహరి నియోజకవర్గ అభివృద్ధి ని పట్టించుకోవడం లేదు అంటూ, రేవంత్ రెడ్డి వసూలు చేసిన టాక్స్ డబ్బులతో ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కొన్నారు అని అన్నారు. రెడ్ల పార్టీలో ఉన్న బీసీ లు బయటకు రండి అని అన్నారు. మోడీని ఢీ కొట్టే సత్తా నాకు తప్ప ఎవరు లేరు అని అన్నారు. చిత్తశుద్ధి ఉన్న ఏ ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయరు అని, తెలంగాణ రాష్ట్రంలో ఇన్వెస్టర్లు లేక అదానికి కట్ట పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పు పెరుగుతుంది అని, ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.
- Tags
- K. A. Paul






