పెన్షనర్స్ అసోసియేషన్ క్యాలెండ‌ర్‌, డైరీ ఆవిష్కర‌ణ

by Disha Web Desk 12 |
పెన్షనర్స్ అసోసియేషన్ క్యాలెండ‌ర్‌, డైరీ ఆవిష్కర‌ణ
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా శాఖ నూతన సంవత్సర క్యాలెండ‌ర్‌, డైరీని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సోమ‌వారం రాత్రి హైద‌రాబాద్‌లో ఆవిష్కరించారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసంలో సోమవారం సాయంత్రం ఆయన అసోసియేషన్ ప్రముఖులు ఈ. నర్సింహారెడ్డి, జి.వీరస్వామి, కె. సమ్మారెడ్డి, కె. సుధీర్ బాబు, ఎస్. రాజయ్య, జి. సత్యనారాయణలతో సమావేశమై వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వరంగల్ నగరంలోని అసోసియేషన్ కార్యాలయం ఫర్ణీచర్ కొనుగోలు కోసం ఆర్థిక సాయం అంద‌జేశారు.

Next Story

Most Viewed