Illegal Registrations: నిబంధనలు పక్కనపెట్టి భూ రిజిస్ట్రేషన్లు! నిఘా ఎక్కడ?

by Ramesh Naini |

గ్రేటర్ వరంగల్ నగర శివారులో కుడా పరిధిలో పదుల సంఖ్యలో వెంచర్లు వెలుస్తున్నాయి. వీటిలో కొన్నింటికి పూర్తిస్థాయిలో అనుమతులు లేకున్నా ప్లాట్లు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

Illegal Registrations: నిబంధనలు పక్కనపెట్టి భూ రిజిస్ట్రేషన్లు! నిఘా ఎక్కడ?
X

దిశ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న భూ రిజిస్ట్రేషన్లపై నిఘాలు లేవు. నిత్యం జరుగుతున్న రిజిస్ట్రేషన్లపై ఆడిటింగ్‌లు లేవు. కొత్త వెంచర్ల ప్లాట్స్ రిజిస్ట్రేషన్ సమయంలో పూర్తిస్థాయిలో రెవెన్యూ పత్రాల పరిశీలన లేదు. గ్రేటర్ వరంగల్ నగర శివారులో కుడా పరిధిలో పదుల సంఖ్యలో వెంచర్లు వెలుస్తున్నాయి. వీటిలో కొన్నింటికి పూర్తిస్థాయిలో అనుమతులు లేకున్నా ప్లాట్లు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. డాక్యుమెంట్స్ పరిశీలన లేకుండానే పాత పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ ప్లాట్ల రిజిస్ట్రేషన్ లో వేలాది రూపాయలు చేతులు మారుతుండగా కొన్నవారు మాత్రం ఇబ్బందులకు గురవుతున్నారు. అంతా ఆన్ లైన్ అయినా మధ్యవర్తులు లేనిదే రిజిస్ట్రేషన్ లు కొన్ని కార్యాలయాల్లో కావడం లేదు. గ్రేటర్ వరంగల్ నగరంతో పరిధిలో వ్యవసాయ భూముల్లో పదుల సంఖ్యలో వెంచర్లు వెలుస్తున్నాయి. నగరం పరిధి దాటితే వెలిసే వెంచర్లకు కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అనుమతులు తీసుకోవాలి. గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు తీసుకొని నాలా కన్వర్షన్ చేసిన తర్వాతనే ప్లాట్స్ రిజిస్ట్రేషన్లు చేయాలి.. శివారు పరిధిలో రింగ్ రోడ్, బైపాస్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, నేషనల్ హైవేల వెంట ఈ వెంచర్లు ఎక్కువగా వెలుస్తున్నాయి. ఈ వెంచర్ల పరిధిలో కొంతమంది కూడా అనుమతులు తీసుకొని ప్లాట్లు చేస్తుండగా మరికొంత మంది గ్రామ పంచాయతీల అనుమతులు తీసుకొని పనులు చేస్తున్నారు. వీటన్నింటికి పూర్తి స్థాయి అనుమతులు ఉండాలి. వెంచర్లలో 10 శాతం భూములు అభివృద్ధి కోసం పంచాయతీలకు అప్ప చెప్పాలి. నాలా కన్వర్షన్ చేసిన తర్వాతనే ప్లాట్లను అమ్మకాలు చేయాలి.

ఇష్టారాజ్యంగా చేస్తున్న రిజిస్ట్రేషన్లు

ఉమ్మడి జిల్లా పరిధిలోని కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇండ్ల స్థలాల సంబంధించి ఆన్ లైన్ లో పత్రాలు సబ్మిట్ చేస్తూ ఫీజులు చెల్లిస్తున్నారు. వాటికి సంబంధించిన పత్రాలను తీసుకువచ్చి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. నగర శివారు పరిధిలోని హసన్ పర్తి, ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, వర్ధన్నపేట, ఐనవోలు, ఖాజిపేట, స్టేషన్ ఘన్పూర్, వేలేర్, దామెర, ఆత్మకూర్, వరంగల్ ఖిల్లా, సంగెం మండలాల పరిధిలో వెంచర్లు ఎక్కువగా వెలిశాయి. రిజిస్ట్రేషన్లు చేసే సమయంలో అన్ని డాక్యుమెంట్లను పరిశీలించి చేయాలి. వ్యవసాయ భూములు వెంచర్లుగా మారిస్తే నాలా కన్వర్షన్లు, కుడా అనుమతులు, గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకున్న తర్వాతనే చేయాలి. వీటిని ఆన్ లైన్ లో ఉన్న రెవెన్యూ పత్రాలతో సరిపోల్చి రిజిస్ట్రేషన్లు చేయాలి. ఏవైనా నిషేదితంగా ఉంటే నిలిపివేయాలి. అనుమతులు లేని ప్లాట్స్ రిజిస్ట్రేషన్ లేని సమయంలో తిరకాసు మొదలవుతుంది. వెంచర్ల యజమానులు కాసులు పెట్టి బ్రోకర్ల ద్వారా పైరవీలు చేస్తున్నారు. ప్లాట్స్ రిజిస్ట్రేషన్లు మేనేజ్ అయ్యే విధంగా చేస్తున్నారు. భూములకు రిజిస్ట్రేషన్లు చేయడంతో పాటు వేల రూపాయలు కాసులు ఖర్చు చేస్తున్నారు. నగరం పరిధిలోని రిజిస్ట్రేషన్ కు ఈ వెంచర్లకు తక్కువగా ఈ పత్రాలు వస్తుండగా ఉమ్మడి జిల్లా పరిధిలో ముఖ్యంగా పాత తాలూకా కేంద్రాల్లో ఉన్న వాటిలో ఎక్కువగా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వివాదాస్పద డాక్యుమెంట్లు చేసే సమయంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

పైరవీల ద్వారా పనులు!

పైరవీల ద్వారా పనులు పూర్తి చేస్తున్నట్లు సమాచారం. పలు దఫాలు విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్, ఏసీబీ తనిఖీలు చేపట్టిన ఇవి మాత్రం పూర్తి కావడం లేదు. ఈ దోపిడీ ఆగడం లేదు. ప్రతి కార్యాలయంలో బ్రోకర్లు లేనిదే పనులు కావడం లేదు. వెంచర్లు, కొనే వారి వద్ద డబ్బులు పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారు. డాక్యుమెంట్లను బట్టి రిజిస్ట్రేషన్ కు డబ్బులు బ్రోకర్లు వసూలు చేస్తున్నారు. శివారు భూములపై కుడా పరిధిలోని భూములపై ముఖ్యంగా వెంచర్లపై అధికారులు దృష్టి పెడితే కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంది.

Next Story