- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
by Bhanu |
అప్పుల బాధ తాళలేక గడ్డి మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ మహా నగర పాలక సంస్థ 15వ డివిజన్ లో చోటు చేసుకుంది.

X
దిశ, గీసుగొండ: అప్పుల బాధ తాళలేక గడ్డి మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ మహా నగర పాలక సంస్థ 15వ డివిజన్ లో చోటు చేసుకుంది. గీసుగొండ సీఐ ఎ.మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ మహా నగర పాలక సంస్థ 15వ డివిజన్ పరిధి రెడ్డిపాలెం గ్రామానికి చెందిన వరాగాని సత్యం(40) వ్యవసాయ కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగించే వాడు.
రెండు సంవత్సరాల నుండి వేరే వారి భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుండగా పంటలు సరిగా పండలేదని,అదేవిధంగా తన భార్యకు ఆస్తమా ఉన్నందున ఆసుపత్రి ఖర్చులు,పిల్లల కాలేజీ ఫీజుల కోసం మొత్తం ఆరు లక్షల రూపాయలు అప్పు చేశాడు. ఆ అప్పును ఎలా తీర్చాలని కుటుంబ సభ్యులకు చెప్పుకుంటూ బాధపడేవాడు.
ఈ తరుణంలో 01/06/2025 రోజు మధ్యాహ్నం సుమారు 2:00 గంటలకు మొగిలిచర్ల గ్రామ శివారులోని కెనాల్ కట్టమీద ఏదో గుర్తు తెలియని గడ్డి మందు తాగి తన కొడుకు యశ్వంత్ తో చెప్పగా వారి కుటుంబ సభ్యులు వెంటనే సత్యాన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 07/06/2025 శనివారం రోజు రాత్రి 11:55 నిమిషాలకు చనిపోయాడని డాక్టర్లు ధృవీకరించగా మృతుడి భార్య వరగాని యక్రాంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
Next Story






