- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పదవీ బాధ్యతల్లో సంవత్సరం పూర్తి చేసుకున్న కుడా ఛైర్మన్ వెంకట్రామ్ రెడ్డి
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి సంవత్సరం పూర్తైన సందర్భంగా ఛైర్మన్ ఇనగాల వెంకట్రమ్

దిశ, హనుమకొండ: కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి సంవత్సరం పూర్తైన సందర్భంగా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మంగళవారం కుడా సమావేశ మందిరంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కుడా వైస్ చైర్మన్ చాహత్ బాజ్‌పాయ్, ప్రాజెక్ట్ ఆఫీసర్ అజిత్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ భీం రావు, జేఎపీవో, ఏపీవో తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ – “నాను పదవిలోకి వచ్చిన నాటి నుంచి అధికారుల సహకారంతో అనేక అభివృద్ధి పనులను చేపట్టగలిగాం.
ప్రజల ఆకాంక్షల్ని గౌరవిస్తూ వరంగల్ నగరాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లేలా కృషి చేస్తున్నాం” అని తెలిపారు. అలాగే ఆయన వరంగల్ మాస్టర్ ప్లాన్ – 2041 పై కీలక చర్చలు జరిపారు. రానున్న నాలుగు సంవత్సరాలలో అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం కోసం రూపొందించిన ప్రణాళికలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ప్రణాళికలు వరంగల్ నగరాభివృద్ధికి మైలురాయిగా నిలవనున్నట్లు అధికార వర్గాలు అభిప్రాయపడ్డాయి.






