అద్భుతమైన ప్రయాణం స్టార్ట్.. హోంబల్ ఫిలమ్స్‌తో సూర్య మూవీ ఫిక్స్

by Chukka Sudharani |

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అభిమానులు ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ వచ్చేసింది.

అద్భుతమైన ప్రయాణం స్టార్ట్.. హోంబల్ ఫిలమ్స్‌తో సూర్య మూవీ ఫిక్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అభిమానులు ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా సూర్య-జ్ఞానవేల్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై అఫీషియల్ అప్డేట్ వచ్చింది. ‘కేజీఎఫ్’, ‘సలార్’, ‘కాంతార’ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హోంబలే ఫిలింస్‌ తమ తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా.. ‘జై భీమ్’ ఫేమ్ దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్నాడు. భారీ నిర్మాణ విలువలకు పేరుగాంచిన ఈ సంస్థతో సూర్య తొలిసారి చేతులు కలపడం సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సందర్భంగా హోంబలే ఫిలింస్ కొన్నొ స్పెషల్ ఫొటోలను షేర్ చేస్తూ.. ‘ఒక అద్భుతమైన ప్రయాణానికి శుభప్రదమైన ఆరంభం.. సూర్య, హోంబలే చిత్రానికి సంబంధించిన పూజాకార్యక్రమాలు గ్రాండ్‌గా జరిగాయి’ అని చెప్పుకొచ్చారు..

Next Story