- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి వాకిడి శ్రీహరి ఆదేశానుసారంగా రూ.90 లక్షల వ్యయంతో నూతన బ్రిడ్జికి శంకుస్థాపన
నర్వ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బిసం చెన్నయ్య సాగర్ చేతుల మీదుగా బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

దిశ, నర్వ: మండల పరిధిలోని జక్కనపల్లి గ్రామంలో మంత్రి వాకిడి శ్రీహరి ఆదేశానుసారంగా రూ.90 లక్షల వ్యయంతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి నర్వ మండల అధ్యక్షులు బీసం చెన్నయ్య సాగర్ చేతులు మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో జక్కన్న పల్లి గ్రామ ప్రజలకు రాకపోకలు మరింత సులభతరంగా అవుతుందని మరియు తొందరగా నర్వ మండలానికి చేరుకునె సౌలభ్యం కలుగుతుందని అన్నారు. జక్కనపల్లి గ్రామ అభివృద్ధికి మరో కీలక అడుగు ముందుకు పడిందని అన్నారు. అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న బీసం చెన్నయ్య సాగర్ కి జక్కన్న పల్లి గ్రామ ప్రజలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ. ఎం .సి .వైస్ చైర్మన్ డి. కృష్ణారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, P.జగన్మోహన్ రెడ్డి, డి. ఈ ఉపేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ గుండ్రాతి అనిత, ఉపసర్పంచ్ వాకిటి నరసింహ వివిధ గ్రామాల సర్పంచులు, మండల ఉపాధ్యక్షులు శరణప్ప మండల ప్రచార కార్యదర్శి బీసం రవికుమార్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, రామన్ గౌడ్ జనార్దన్ రెడ్డి, నర్వ గ్రామ అధ్యక్షులు సద్దల ఆంజనేయ రెడ్డి, బోయపాటి నరసింహ ముష్టిపల్లి, శ్రీకాంత్ మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






