- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణపై నితిన్ నబీన్‌కు ఎలాంటి అవగాహన లేదు : ఎంపీ చామల కిరణ్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కి దేశ రాజకీయాలపై పట్టు లేన్నట్లుగా, తెలంగాణపై ఆయనకి ఎలాంటి అవగాహన లేనట్లుగా కనిపిస్తోందని భువనగిరి ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కి దేశ రాజకీయాలపై పట్టు లేన్నట్లుగా, తెలంగాణపై ఆయనకి ఎలాంటి అవగాహన లేనట్లుగా కనిపిస్తోందని భువనగిరి ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సోమవారం గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నితన్ నబీన్ కి ఇన్ పుట్స్ సరిగ్గా ఇవ్వలేదని, నితిన్ నబీన్ కి తెలంగాణలో గత పాలకుల గురించి తెలుసుకోలేదని విమర్శలు గుప్పించారు. నితిన్ నబీన్ గతంలో బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకులు కాళేశ్వరం గురించి ఏం మాట్లాడారో తెలుసుకోవాలని, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు తెలుసుకొని పర్యటనలు చేయాలని ఎంపీ చామల హితవు పలికారు. బీజేపీ పార్టీ బీఆర్ఎస్ కి కాళేశ్వరం ఏటీఎంగా మారిందని ఆరోపించారని, ఇప్పుడు నితిన్ నబీన్ వచ్చి అవినీతి జరగకుండా చూస్తామని అంటున్నారని ఫైర్ అయ్యారు.
12 ఏళ్లుగా మీరే దేశంలో అధికారంలో ఉన్నారు.. మీ నేతలందరికీ తెలుసు ఎవరు కాళేశ్వరంలో అవినీతి చేశారో అని ఎంపీ చామల అన్నారు. సీబీఐకి ఇస్తే 48 గంటల్లో అవినీతి చేసిన వారికి బుద్ధి చెబుతారని అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి ఇవ్వాలని లేఖ రాసినా ఇప్పటివరకు మీరు కేసు అప్పగించలేదని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దేశ ప్రజలకు ఏం కావాలో సోనియా గాంధీకి తెలుసన్నారు. బీజేపీ జాతీయ మేనిఫెస్టో 2014 లో ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని మోడీ చెప్పారో చూడాలని, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో నితిన్ నబీన్ చెప్పాలని ఎంపీ చామల డిమాండ్ చేశారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేది లేదని, మీకు ఏజెండానే లేదని ఆయన వ్యగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ నేతలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని గెలవాల్సిందే అని, 2019 ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని ఓట్లు, 2024 ఎంపీ ఎన్నికల్లో ఎన్ని వచ్చాయో చెక్ చేసుకోండని కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు.






