షెడ్యూల్ ప్రకారం కేయూ డిగ్రీ, పీజీ (రెగ్యులర్, దూరవిద్య) పరీక్షలు

by Batti.Sumithra |

కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ, పీజీ (రెగ్యులర్, దూరవిద్య) పరీక్షలు షెడ్యూల్ ప్రకారం యథావిధిగా జరుగుతాయి.

షెడ్యూల్ ప్రకారం కేయూ డిగ్రీ, పీజీ (రెగ్యులర్, దూరవిద్య) పరీక్షలు
X

దిశ, హన్మకొండ టౌన్ : కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్ 27 నుంచి నిర్వహించబడే అన్ని డిగ్రీ, పీజీ (రెగ్యులర్, దూరవిద్య) పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం యథావిధిగా జరుగుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కట్ల రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని అన్ని కళాశాల యాజమాన్యాలు, విద్యార్థులు గమనించి, నిర్ణీత తేదీలకు అనుగుణంగా పరీక్షలకు హాజరు కావాలని ఆయన సూచించారు.

Next Story