- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహబూబాబాద్‌లో కేటీఆర్ పర్యటన వాయిదా.!
by Ratna Kumari |
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్, మున్సిపాలిటీలో నిర్వహించాల్సిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పర్యటన వాయిదా పడింది.

X
దిశ, మహబూబాబాద్ : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్, మున్సిపాలిటీలో నిర్వహించాల్సిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పర్యటన వాయిదా పడింది. తొలుత ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం.. కేటీఆర్ ఇవాళ జిల్లా కేంద్రానికి రావాల్సి ఉన్నప్పటికీ,రాష్ట్రంలోని మరికొన్ని మున్సిపాలిటీలలో కేటీఆర్ పర్యటనలు ఉండడం, షెడ్యూల్ సర్దుబాటు కుదరకపోవడంతో ఈరోజు జరగాల్సిన మహబూబాబాద్ మున్సిపాలిటీ పర్యటనను రేపటికి వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కేటీఆర్ పర్యటన వాయిదాతో బీఆర్ఎస్ శ్రేణులు కొంత నిరాశకు గురైనప్పటికీ, రేపటి కార్యక్రమాలను మరింత విజయవంతంగా నిర్వహించేందుకు సన్నాహాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు ప్రచార వేగాన్ని మరింత పెంచుతున్నారు.
Next Story






