ఈ నెల 9 న భూపాలపల్లి కి రానున్న కేటీఆర్...

by Taduka Kalyani |

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు అక్టోబర్ 9 నాడు భూపాలపల్లి లో కేటీఆర్ పర్యటన ఉంటుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు.

ఈ నెల 9 న భూపాలపల్లి కి రానున్న కేటీఆర్...
X

దిశ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు అక్టోబర్ 9 నాడు భూపాలపల్లి లో కేటీఆర్ పర్యటన ఉంటుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ అక్టోబర్ 9 సోమవారం రోజున ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా భూపాలపల్లి చేరుకుంటారని, అనంతరం భూపాల్ పల్లి లో నూతనంగా 50 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయం, 40 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలో నిర్మించిన సెకండ్ ఫేస్ డబుల్ బెడ్ రూమ్ లను లబ్ధిదారులకు అందిస్తారని తెలిపారు. అనంతరం భూపాల్ పల్లి లోని సుభాష్ కాలనీ ప్రాంగణంలో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. మంత్రి కేటీఆర్ పర్యటనలకు పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర పిలుపునిచ్చారు.

Next Story