విద్య ప్రోత్సాహానికి ఇచ్చిన మాట తప్పను : పుట్ట మధుకర్

by Bhanu |

మండల కేంద్రానికి చెందిన గంట జ్యోత్స్న ఎంబీబీఎస్‌ కోర్సు పూర్తయ్యే వరకు ఖర్చులు భరిస్తానని మాట ఇచ్చిన మంథని మాజీ

విద్య ప్రోత్సాహానికి ఇచ్చిన మాట తప్పను : పుట్ట మధుకర్
X

దిశ, మల్హర్( కాటారం): మండల కేంద్రానికి చెందిన గంట జ్యోత్స్న ఎంబీబీఎస్‌ కోర్సు పూర్తయ్యే వరకు ఖర్చులు భరిస్తానని మాట ఇచ్చిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ తన మాట నిలబెట్టుకొని మెడికల్ స్టూడెంట్ కు మాజీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆదివారం చెక్కు అందించారు. రెండు రోజుల క్రితం భీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకల్లో బాగంగా గిఫ్ట్‌ ఏ స్మైల్‌ ద్వారా ఏడాదికి ఖర్చు అయ్యే రూ.2లక్షల సాయం విద్య ప్రోత్సాహానికి అందిస్తానని జ్యోత్స్న కుటుంబానికి భరోసా ఇచ్చారు.

ఈ క్రమంలో భూపాలపల్లి జిల్లా మొగుళ్ళ పల్లి మండలం ఇస్సిపేట గ్రామంలోనీ శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్ లో గంట జ్యోత్స్నకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ చేతుల మీదుగా చెక్కు అందజేశారు. మాట ఇచ్చి తన భవిష్యత్‌కు బంగారు బాట వేసిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులకు జ్యోత్స్న కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ ఛైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి రాకేష్ మరియు భీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Next Story