- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కృష్ణ కాలేజీకి కొత్త బిల్డింగ్.. శంకుస్థాపన చేసిన మంత్రి కొండా సురేఖ
వరంగల్ పట్టణంలోని కృష్ణ కాలనీలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డా.సత్య శారదతో కలసి గురువారం శంకుస్థాపన చేశారు.

దిశ, వరంగల్ టౌన్ : వరంగల్ పట్టణంలోని కృష్ణ కాలనీలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డా.సత్య శారదతో కలసి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుమారు ఏడు దశాబ్దాల క్రితం బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్రభుత్వ మహిళా కళాశాలగా మంచి గుర్తింపు ఉన్న కృష్ణ కాలేజీ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవన నిర్మాణానికి అరబిందో ఫార్మా కంపెనీ ముందుకు వచ్చి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద సుమారు 5 కోట్ల రూపాయలతో మూడు అంతస్తుల్లో 15 తరగతి గతులతో పాటు 60 టాయిలెట్లను నిర్మిస్తున్నందుకు వారిని మంత్రి అభినందించారు. దీనితోపాటు ప్రభుత్వ పాఠశాలను సుమారు కోటిన్నర రూపాయల వ్యయంతో సీఎస్ ఆర్ క్రింద ప్రభుత్వ పాఠశాల నిర్మాణం త్వరలో చేపడతామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల భవనానికి అవసరమగు మరమ్మత్తుల కొరకు తన నిధులు కేటాయిస్తానని, అందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో వరంగల్ ను రెండవ రాజధానిగా చేయుటకు కృత నిశ్చయంతో ముందుకెళుతున్నట్టు తెలిపారు. బల్దియా ఆధ్వర్యంలో శాశ్వతంగా డ్రైన్ నిర్మాణం చేపడతామని మేయర్ ప్రకటించడం పట్ల మంత్రి అభినందించారు. భవిష్యత్తులో కృష్ణా కళాశాల వరద నీటి ముంపుకు గురికాకుండా శాశ్వత చర్యల్లో భాగంగా బల్దియా ఆధ్వర్యంలో రైల్వే ట్రాక్ క్రింద నుండి డ్రైన్ నిర్మాణానికి డి పి ఆర్ సిద్ధం చేయాలని, రైల్వే అధికారులతో సంప్రదించి పరిష్కారం చేస్తామని మంత్రి తెలిపారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ కృష్ణా కాలనీ కళాశాల పునర్ వైభవానికి కృషి చేస్తున్న మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
జీ డబ్ల్యూ ఏం సి తరపున డ్రైన్ నిర్మానణానికి సహకారం అందిస్తామని, తాను కూడా 1982 ఇక్కడే ఇంటర్ చదువుకోన్నానని గుర్తు చేసిన మేయర్, గతంలో ఆడపిల్లల చదువుకు ఇదే కళాశాల దిక్సూచిగా ఉండేదని సైన్స్ విద్యార్థులకు చక్కని ల్యాబ్ సౌకర్యం ఈ కళాశాల సొంతం అని తెలిపారు. కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ మంత్రి సురేఖ ప్రత్యేక చొరవ చూపి అరవిందో ఫార్మా వారితో పలుమార్లు సంప్రదించడం వల్ల ఈరోజు సిఎస్‌ఆర్ కింద ఐదు కోట్ల రూపాయల తో కళాశాల భవనం నిర్మించడం సాధ్యమైందని అన్నారు. ఇతర కార్పొరేట్ సంస్థలతో సంప్రదించి త్వరలో ప్రభుత్వ పాఠశాలను కూడా సిఎస్‌ఆర్ క్రింద పునర్నిర్మానం చేయుటకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. భవన నిర్మాణం జరుగుతున్న నేపధ్యంలో ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా షిఫ్టులవారీగా తరగతుల నిర్వహణకు ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకోనున్నట్లు తెలిపారు. కళాశాల భవన నిర్మాణాన్ని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా అరబిందో ఫార్మా ప్రతినిధులను ను కలెక్టర్ కోరారు. అనంతరం పదవ తరగతిలో రాష్ట్రంలో ద్వితీయ ర్యాంక్ సాధించిన విద్యార్థిని మంత్రి, మేయర్, కలెక్టర్లు సన్మానించారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ లు చింతాకుల అనిల్ కుమార్ కావేటి కవిత బస్వరాజు కుమార స్వామి సురేష్ జోషి, అరబిందో ఫార్మా డైరెక్టర్ సదానంద రెడ్డి, జిల్లావిద్యాధికారి జ్ఞానేశ్వర్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శ్రీధర్ సుమన్, కళాశాల ప్రిన్సిపల్ శరదృతి, తదితరులు పాల్గొన్నారు.






