- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదే పోకడ...సీఏ చేతివాటం... కోరుకొండపల్లి లో డబ్బులు కాజేస్తున్న సీఏ
కేసముద్రం మండలం లోని కోరుకొండపల్లి గ్రామంలో ఒక సిఏ చేతివాటం చవి చూసింది... వివరాలకు వెళితే మహిళా సంఘాలలో సిఎ తన గ్రూపు సభ్యులకు డబ్బులు ఇప్పించగా ఆ గ్రూపుల డబ్బులు తిరిగి రెండు సంవత్సరాలైనా కట్టకపోగా..

దిశ, కేసముద్రం : కేసముద్రం మండలం లోని కోరుకొండపల్లి గ్రామంలో ఒక సిఏ చేతివాటం చవి చూసింది... వివరాలకు వెళితే మహిళా సంఘాలలో సిఎ తన గ్రూపు సభ్యులకు డబ్బులు ఇప్పించగా ఆ గ్రూపుల డబ్బులు తిరిగి రెండు సంవత్సరాలైనా కట్టకపోగా.. బ్యాంకులలో ఇప్పించినటువంటి మహిళా సంఘం రుణాలను జమ చేయకపోగా ఆ డబ్బులను కాజేసినట్టు ఆ గ్రూప్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మహిళా సంఘం డబ్బులు గత రెండు సంవత్సరాలుగా కట్టకపోగా గట్టిగా సభ్యులు అడిగే సరికి మీరు కట్టిన డబ్బులు కూడా నేను ఇవ్వను అని సిఏ చెప్పుకొచ్చింది.. ఈ సంఘటన గతంలో కూడా చాలా సార్లు ఈ సీఏ నుంచి పై ఆరోపణలు వినపడ్డాయ. సీఏ గతంలో కూడా లక్షల దండుకున్న వైనం మారని తీరు గా వ్యవహరిస్తున్న సిఏ పట్ల వారి అధికారులు కొమ్ముకాస్తున్నట్లుగా మహిళా సంఘం గ్రూప్ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఆమెపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పి కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు. ఈ గ్రూపు లోన్ టర్మ్ కూడా అయిపోయింది సిఏ కి పలుమార్లు డబ్బులు జమ చేస్తున్నప్పుడు మాకు లోన్ ఇప్పియండి అని అడిగినా కానీ ఏదో ఒక సాకు చెప్పి రెండు సంవత్సరాలు కాలం గడిపి తీరా ఆరా తీసేసరికి గ్రూపు డబ్బులు 2 సంవత్సరాల నుంచి జమ చేయనట్లు విషయం తెలిసింది. విషయం తెలుసుకున్న మహిళా సంఘం గ్రూప్ సభ్యులు లబోదిబో అని మొత్తుకున్నారు. మాకు న్యాయం చేయండి అని మహిళ సమైక్య భవనం వద్ద సీఏను మరియు అధికారులను నిలదీస్తూ అడిగి ఆందోళన చేపట్టారు.






