మృతుడి కుటుంబానికి కొండా పరామర్శ

by Bhanu |

అనారోగ్య కారణంతో అకాలంగా మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్.

మృతుడి కుటుంబానికి కొండా పరామర్శ
X

దిశ, గీసుగొండ: అనారోగ్య కారణంతో అకాలంగా మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్. మండలంలోని మరియాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గంటా శేషగిరి అనారోగ్యంతో అకాలంగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ గురువారం మృతుడి ఇంటికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.


అనంతరం మృతికి కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అధైర్య పడవద్దని ఎల్లవేళలా అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రడం భరత్ కుమార్, గోపాల నవీన్ రాజ్, వీరగోని రాజ్ కుమార్, అల్లం మర్రెడ్డి,మాజీ ఎంపీటీసీ వీరారావు, బోనాల అశోక్,మల్లారెడ్డి చిన్ని, శోభన్,పేర్ల శ్రవణ్,మంద అనిల్, మరియాపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెంటారెడ్డి జోజిరెడ్డి,నర్సింగ రావు, మోహన్ రావు,బాలరాజు, ఆడేపు రామనాథం,దిలీప్ రెడ్డి,బిట్ల శివ ప్రసాద్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Next Story