- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLS పాయింట్ అధికారుల ఘరానా మోసం
కేసముద్రం మండల కేంద్రంలోని మండల్ లేవల్ సర్వీస్ పాయింట్ సివిల్ సప్లై ఆధ్వర్యంలో నడిచే గోదాంలో డీలర్లకు పంపిణీ విషయంలో కాంటాక్ట్ కింద కర్రలు పెట్టేసి ఘరానా మోసం చేస్తున్నారు.

దిశ, కేసముద్రం : కేసముద్రం మండల కేంద్రంలోని మండల్ లేవల్ సర్వీస్ పాయింట్ సివిల్ సప్లై ఆధ్వర్యంలో నడిచే గోదాంలో డీలర్లకు పంపిణీ విషయంలో కాంటాక్ట్ కింద కర్రలు పెట్టేసి ఘరానా మోసం చేస్తున్నారు. ఇదేంటి అని డీలర్లు ప్రశ్నిస్తే గోదాంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ సారంగపాణి ఎవరికీ చెప్పుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి అని విభిన్నమైన సమాధానం చెబుతూ దాటేశారు. తీర డీలర్లందరూ మూకుమ్మడిగా పాయింట్ వద్ద ప్రశ్నించగా ఎప్పటినుంచో జరిగేటువంటి తంతు అని దాటేశారు.
వేమెంట్ కాంటాలేనిది డీలర్లు తీసుకోలేరు బయట వే బ్రిడ్జి కాంటా అయితే అవకతవకలు భారీగా జరిగే అవకాశం ఉంది, ఇదే పరిణామం లో డీలర్లు అందరూ ఎం ఎల్ ఎస్ పాయింట్ కి వెళ్లారు. అక్కడి పరిస్థితిని గమనించి కాంటా కింద కర్రలను తీసివేసి బాట్ లు తొలగించి ఊడ్చి శుభ్రపరిచి కాంటవెయ్యగా 96 బస్తాలకు 48 క్వింటాళ్లు పరిమాణం రావాలి, కానీ అందుకు భిన్నంగా 49 క్వింటాళ్ల 17 కిలోలు వచ్చాయి. ఏంటిది అని ప్రశ్నించగా వేస్కేల్ పని చేయట్లేదు అని సారంగపాణి చెప్పారు. సగటు ఒక్క డీలర్ కి 2 నుంచి 3 క్వింటాళ్లు తక్కువగా వస్తున్నాయి.ఈ క్రమంలో జిల్లా తూనికల అధికారి విజయకుమార్ నీ సంప్రదించగా తనకు ఎలాంటి సమాచారం లేదని డీలర్ల ఫిర్యాదు మేరకు సాంకేతిక నిపుణుని పంపించి సరి చేస్తానని చెప్పారు.
ఎం ఎల్ ఎస్ పాయింట్ లో కాంట సరిగ్గా పని చేయుట లేదు. ఎం ఎల్ ఎస్ పాయింట్ పర్యవేక్షణలో ఉన్న అధికారులు పై అధికారులకు ఫిర్యాదు చేయలేదు, డీలర్లు కు బియ్యం కొరత వస్తుంది దేనికి అని పూర్తి విశ్లేషణ చేసి ఎం ఎల్ ఎస్ పాయింట్ కి వెళ్లి అధికారులను ప్రశ్నిస్తే బదులు లేదు తునికిల శాఖ విజయ్ కుమార్ గారికి సంప్రదించగా తనకు ఎలాంటి సమాచారం లేదని సాంకేతిక ఇబ్బందులు ఏమన్నా ఉంటే సరి చేస్తామని బదులు చెప్పారు గత నెలలో మండల కేంద్రంలోని డీలర్లకు సన్న బియ్యం బదులు కొన్ని బస్తాలు దొడ్డు రకం కూడా వచ్చినట్లు డీలర్లు చెప్పుకొచ్చారు, సన్న బియ్యం పంపిణీలో దొడ్డు రకం ఎలా వచ్చాయని ప్రశ్నించగా ఎం ఎల్ ఎస్ పాయింట్ అధికారులు పైనుంచి వస్తున్నాయి, వీలు చూసి మారుస్తామని బదులు చెప్పారు. డీలర్లు ఎం ఎల్ ఎస్ పాయింట్లోని కెమెరా పర్యవేక్షణ ఎందుకు పనిచేయట్లేదు అని అడగగా ఇన్చార్జి నేను విధుల్లో చేరినప్పటి నుండి అవి పని చేయట్లేదు అని సమాధానం చెప్పారు. ఇప్పటికైనా స్థానిక అధికారులు ఎమ్మార్వో, గిర్ధవర్, పర్యవేక్షించి ప్రజా పంపిణీ సక్రమంగా జరిగే విధంగా చర్య తీసుకోవాలని డీలర్లు కోరుచున్నారు.






