- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kesamudram: యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా..!
కేసముద్రం మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలకు పట్ట పగలే యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతున్నది.

దిశ, కేసముద్రం: కేసముద్రం మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలకు పట్ట పగలే యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతున్నది. సంబంధిత ప్రభుత్వ విభాగాలు నిఘా పెట్టకపోవడంతోనే కొందరు ఇసుక వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక దందాను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అక్రమార్కులు అదును చూసి ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలం లోని కేసముద్రం, వెంకటగిరి, ఉప్పరపల్లిచ అర్పణపల్లి, కాట్రపల్లి నుంచి పక్క మండలం నెల్లికుదురు నుంచి ఇసుకను పలు గ్రామాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
నెంబరు ప్లేటు లేని వాహనాల్లో..
గుట్టు చప్పుడు కాకుండా నెంబరు ప్లేటు లేని వాహనాల్లో ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక వ్యాపారం లాభసాటిగా మారడంతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా మండల సరిహద్దు దాటుకుని రోజుకు పదుల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు వెళ్తున్నాయి. ఇసుకను తరలిస్తున్న వాహనాలను ఎక్కువగా మైనర్లే నడుపుతున్నారు. ఇసుక వాహనాలను డ్రైవర్లు అతివేగంగా నడపడంతో ఇతర వాహనదారులు, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఓవర్ స్పీడ్‌తో వస్తున్న ఇసుక వాహనాలతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలను మైనర్లు డ్రైవింగ్ చేస్తున్నా పట్టించుకునే నాథుడేలేడని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు తనిఖీలు చేసి ఇసుక వాహనాలను స్వాధీనం చేసుకుని నామమాత్రపు జరిమానాలు విధిస్తూ వదిలేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు, రెవెన్యూశాఖ అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.






