- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతీకార చర్యగా.. పోలీస్ స్టేషన్ ముందే గొడ్డలితో హత్యాయత్నం
హత్యకు ప్రతీకార చర్యగా మృతుని కుమారుడు పోలీస్ స్టేషన్ ముందే గొడ్డలితో హత్య చేసేందుకు తెగబడిన దారుణ సంఘటన కాటారంలో మంగళవారం జరిగింది.

దిశ, మల్హర్(కాటారం): హత్యకు ప్రతీకార చర్యగా మృతుని కుమారుడు పోలీస్ స్టేషన్ ముందే గొడ్డలితో హత్య చేసేందుకు తెగబడిన దారుణ సంఘటన కాటారంలో మంగళవారం జరిగింది. తన తండ్రిని కుటుంబ ఆస్తి తగాదాల్లో హత్య చేసిన నిందితురాలు లక్ష్మిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. కొందరు వ్యక్తులు తన దాడిని అడగించడంతో తీవ్ర గాయంతో కోన ఊపిరితో కొట్టుమిట్టాలాడింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను భూపాలపల్లి వంద పడకల ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. మండలంలోని దేవరంపల్లి గ్రామానికి చెందిన మార్పాక సారయ్యను ఐదు గుంటల స్థలం ఆస్తి తగాదాలపై గత సంవత్సరం డిసెంబర్ 14న నిందితురాలు లక్ష్మీ తో పాటు మరో ముగ్గురు హత్యకు తెగబడ్డారు.
ఈహత్య చేసిన కేసులో లక్ష్మి అరెస్టై జైలుకు వెళ్లి కండిషన్ బెయిల్ మీద ఇటీవల విడుదలైంది. కోర్టు కండిషన్ ప్రకారం పోలీస్ స్టేషన్ కు రోజువారీగా సంతకాలు పెడుతూ ఒంటరిగా వెళుతున్న విషయం తెలుసుకున్న మృతుడు సారయ్య కుమారుడు అంజి అనే యువకుడు తండ్రిని చంపిన కోపంతో ప్రతికార చర్యగా చిన్నమ్మను హత్య చేసేందుకు పథకం పన్నాడు. గొడ్డలితో మెడపై హత్య చేశాడు కానీ ఆమె ప్రాణాపాయంలో బతికి బయటపడింది. 100 పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. లక్ష్మిని గొడ్డలితో హత్య చేసి ఇదే పోలీస్ స్టేషన్లో లొంగి పోవడానికి ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో అక్కడినుండి అంజి ఫరార్ అయ్యాడు. హత్యకు తెగబడ్డ యువకుని పట్టుకునే పనిలో పోలీసులు వెతుకులాట మొదలుపెట్టారు.






