కర్రెగుట్టలపై ఎన్‌కౌంటర్.. ప్రచారంలో నిజమెంత?

by Bhanu |   (  Updated:2025-05-08 11:16:19  IST  )

కర్రెగుట్టలపై ఎన్‌కౌంటర్.. ప్రచారంలో నిజమెంత?
X

దిశ, వరంగల్/భద్రాచలం : కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో ఈరోజు ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలినట్టు ప్రచారం జరగుతుంది. ఈ ఘటనలో కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ తో సహా మొత్తం 10 మంది మావోయిస్టులు మరణించారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనలో ముగ్గురు తెలంగాణ గ్రేహౌండ్స్ జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో వీరు మరణించగా, పలువురు జవాన్లు గాయపడ్డారని, వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ప్రచారాన్ని తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు ఖండించారు. ఈ రోజు ఎలాంటి ఎన్ కౌంటర్ జరగలేదని తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, వైరల్ అవుతున్న ఫొటోలు అన్నీ ఫేక్ అని కొట్టిపారేశారు.

Next Story