జన సందోహం కాళేశ్వర క్షేత్రం.. ఉత్సాహంతో భక్తుల పుష్కర స్నానం

by Bhanu |

సరస్వతి పుష్కరాలకు 11వ రోజు భక్తులు త్రివేణి సంగమానికి పోటెత్తడంతో కాళేశ్వర క్షేత్రం జన సందోహంతో కళకళలాడింది.

జన సందోహం కాళేశ్వర క్షేత్రం.. ఉత్సాహంతో భక్తుల పుష్కర స్నానం
X

దిశ, మల్హర్(కాళేశ్వరం): సరస్వతి పుష్కరాలకు 11వ రోజు భక్తులు త్రివేణి సంగమానికి పోటెత్తడంతో కాళేశ్వర క్షేత్రం జన సందోహంతో కళకళలాడింది. ఆదివారం ఉత్సాహవంతంగా వేల సంఖ్యలో భక్తులు పుష్కర స్నానం ఆచరించారు.సరస్వతి నదీ పుష్కరోత్సవాలు 11వ రోజు కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో భక్తుల ఓం నమశ్శివాయ నామస్మరణంతో మారు మోగింది. తెల్లవారుజామునే పెద్ద ఎత్తున భక్తుల రద్దీ పెరగడం, కాళేశ్వరం చేరుకుంటూ పుష్కర స్నానాలను ఆచరించడం.త్రివేణి సంగమం నదీతీరంలో పవిత్ర పుణ్య స్నానాలు చేసి, భక్తులు ముక్తీశ్వర స్వామి దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. అయితే కాలేశ్వరం వస్తున్న భక్తులకు చేదు అనుభవం ఎదురయింది ఏడు కిలోమీటర్ల దూరం తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో భక్తులు పుష్కర స్నానం ఆచరించడానికి పుష్కర ఘాటు వరకు ఏడు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడం భక్తులకు తప్పలేదు తిప్పలు.


ఎక్కడి వాహనాలు అక్కడే గంటల తరబడి నిలిచిపోవడం వారి దర్శనానికి కాస్త ఆలస్యం కావడం పట్ల అధికారుల తీరుపై మండిపడ్డారు. ట్రాఫిక్ అంతరాయాన్ని నియంత్రించే పనిలో పోలీస్ సిబ్బంది ఎంత ప్రయత్నించినా వాహనదారులు ఎవరికి వారు ఏమన్నా తీరంగా ప్రవర్తించడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఎట్టకేలకు ట్రాఫిక్ క్లియర్ కావడంతో పుష్కర ఘాట్లకు చేరుకొని భక్తులు స్నానం ఆచరించి ముక్తీశ్వర స్వామి దర్శనానికి క్యూలో నిలబడ్డారు. రాష్ట్ర గవర్నర్ దర్శనం వల్ల క్యూలో నిలబడ్డ భక్తులకు తప్పలేదు తిప్పలు.. ఓ పక్క ట్రాఫిక్ అంతరాయం, దర్శనానికి ఆలస్యం కావడం పట్ల భక్తులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాలతో కాళేశ్వరం సరికొత్త కాంతులీనుతోంది. కనీవిని ఎరగని స్థాయిలో భక్త జనం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తోంది. శతాబ్దాలుగా సరస్వతి నదికి పుష్కరాలు జరుపుకునే ఆనవాయితీ కొనసాగుతున్నా అధికారికంగా ఇదే తొలిసారి కావడం విశేషం. ఉత్తరాదిన ఉన్న ప్రయాగరాజ్ వద్ద మాత్రమే పుష్కరాలు నిర్వహించుకునే సాంప్రాదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కాళేశ్వరంలో ప్రారంభించింది. దీంతో దేశంలో రెండో చోట సరస్వతి నది పుష్కరాలు నిర్వహించుకునే సాంప్రాదాయానికి శ్రీకారం చుట్టినట్టయింది.

అట్టహాసంగా 11వ రోజు సరస్వతి నవరత్న మాలా హారతి ..

సరస్వతి పుష్కరాల్లో భాగంగా సరస్వతి ఘాట్ వద్ద 11వ రోజు నిర్వహించిన సరస్వతి నవరత్న మాలా హారతి మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రకాశవంతమైన దీపాల వెలుగులో త్రివేణి సంగమం దేవమందిరంలా మెరిసింది. కాశీ పూజారులు వేదఘోషల మధ్య హారతిని నిర్వహించారు. ఈ మహామంగళ హారతిని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మంత్రముగ్ధులయ్యారు. సరస్వతి నవరత్న మాల హారతిలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామాణాభి వృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ ఈ పుణ్య ఘడియలు అందరికీ శ్రేయస్సును, శుభాన్ని కలిగించాలని, సరస్వతి అమ్మవారి కృపతో మన తెలంగాణ అభివృద్ధి బాటలో పయనించాలని అమ్మవారిని ప్రత్యేకంగా పూజించినట్లు ఆమె తెలిపారు.


కార్యక్రమాన్ని ఆసాంతం దిగ్విజయంగా నిర్వహిస్తన్నందుకు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీ కృష్ణ, భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్య నారాయణ రావు, సీఎంఓ కార్యదర్శి శ్రీనివాస రాజు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.ప్రముఖులతో పాటు సాధారణ భక్తులు కూడా హారతిని వీక్షించేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అవసరమైన ఏర్పాట్లు చేయడంతో రోజూ రాత్రి గంటకు పైగా నిర్వహించే హారతిని వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు కాళేశ్వరంలోనే ఉండిపోవడం విశేషం.

Next Story