సర్పంచ్ ల విజ‌యం వెనుక‌ కడియం శ్రీహ‌రి

by velandi.Saikiran |

సర్పంచ్ ల గెలుపున‌కు కారణం కడియం అన్నారు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య. స్టేషన్ ఘనపూర్

సర్పంచ్ ల విజ‌యం వెనుక‌ కడియం శ్రీహ‌రి
X

దిశ, ధర్మసాగర్: సర్పంచ్ ల గెలుపున‌కు కారణం కడియం అన్నారు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమానికి స్థానికశాసన సభ్యులు కడియం శ్రీహరితో కలసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ, సర్పంచ్‌లుగా ఎన్నికైన కాంగ్రెస్ నాయకులు, గ్రామాల హక్కుల కోసం గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు.

నూతన ప్రజాప్రతినిధుల గెలుపు తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. సర్పంచ్ ల గెలుపున‌కు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కాగా, మరోవైపు కడియం శ్రీహరి కారణమని స్పష్టం చేశారు. కడియం శ్రీహరి ప్రజల కోసం కట్టుబడి పనిచేసినట్లే, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మీరు కూడా పని చేయాలని సూచించారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లక్ష 28 వేలకుపైగా ఓట్లు నమోదయ్యాయని తెలిపారు. బీఆర్ఎస్‌కు సగం ఓట్లు మాత్రమే దక్కాయని, బీజేపీ పూర్తిగా గల్లంతైందని వ్యాఖ్యానించారు. రానున్న 2029లో ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని అన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని అన్నారు.రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే ఉత్సాహంతో కష్టపడి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

Next Story