జవార్ జొన్నలో తాలు ఎక్కువ‌.. గింజలు తక్కువే

by Nallavelli.Anjaneyulu |

మండలంలోని ముల్కనూరు సహా పలు గ్రామాల్లో జవార్ (జొన్న) పంట రైతులను తీవ్ర నిరాశకు గురిచేసింది. సొసైటీ అధికారుల ద్వారా పంపిణీ చేసిన జవార్ విత్తనాలతో పంట సాగు చేయగా, తాలు ఎక్కువగా, గింజలు తక్కువగా రావడంతో రైతులు ఆర్థిక నష్టాలను ఎదుర్కొన్నారు.

జవార్ జొన్నలో తాలు ఎక్కువ‌.. గింజలు తక్కువే
X

దిశ, భీమదేవరపల్లి : మండలంలోని ముల్కనూరు సహా పలు గ్రామాల్లో జవార్ (జొన్న) పంట రైతులను తీవ్ర నిరాశకు గురిచేసింది. సొసైటీ అధికారుల ద్వారా పంపిణీ చేసిన జవార్ విత్తనాలతో పంట సాగు చేయగా, తాలు ఎక్కువగా, గింజలు తక్కువగా రావడంతో రైతులు ఆర్థిక నష్టాలను ఎదుర్కొన్నారు. స్థానిక అంచనాల ప్రకారం.. సుమారు 50 నుంచి 60 ఎకరాల విస్తీర్ణంలో పంట నష్టం జరిగినట్టు తెలుస్తోంది. సొసైటీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో మొత్తం 205 మంది రైతులకు జవార్ జొన్న విత్తనాలు పంపిణీ చేశారు. మొత్తం 750 ఎకరాలకు విత్తనాలు అమ్మకాలు చేశామని మండలం లోని సుమారు 600 ఎకరాల్లో పంట సాగు కాగా.. ముల్కనూరు గ్రామంలో 180 ఎకరాలకు విత్తనాలు అందించిన‌ట్టు అధికారులు తెలిపారు. అదనంగా మరో 150 ఎకరాల్లో ఇతర ప్రాంతాల్లో కూడా విత్తనాలు పంపిణీ చేసిన‌ట్టు స‌మాచారం.

రైతులు సొసైటీపై ఉన్న నమ్మకంతో విత్తనాలు కొనుగోలు చేసి పంట సాగు చేసినట్లు తెలిపారు. ఈ పంట నాలుగు నెలల వ్యవధిలో పండిస్తున్నారు. అధికారులు ఎకరానికి సుమారు 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని సూచించడంతో రైతులు ఆశతో పంట సాగు చేశారు. అయితే కోత దశలో తాలు ఎక్కువగా కనిపించి గింజలు సరిగా కట్టకపోవడంతో దిగుబడి గణనీయంగా తగ్గింది. ఎకరానికి 2, 3, బస్తాలు మాత్రమే రావడంతో పెట్టుబడులు తిరిగి రాక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖకు అధికారి ఫోన్ చేసి వివరాలు కోరగా.. ఆమె డైరీ మేనేజర్ కి తెలుసు అని దాట‌వేశారు. డైరీ మేనేజర్ ను ఫోన్ లో సంప్ర‌దించ‌గా.. నా భూమి లో ఈ జవార్ జొన్న వేసాను కానీ కొన్ని ఎకరాల దాకా మొదట పంట నష్టం వాటిల్లింది. తరువాత పంట వేసాను. కోసే దశలో ఉన్నది. అని చెప్పారు.1000 మంది దాకా ఈ జొన్న విత్తనాలు బ్యాగ్ లు అమ్మకాలు చేశారని ఈ వివరాలు సొసైటీ అధికారులను అడగండి అని తెలిపారు. తరువాత ఆ అధికారి తో ఫోన్ మాట్లాల ద్వారా వివరాలు కోరగా.. ఒక్కసారి మీరు డైరీ మేనేజర్ తో మాట్లాడారా అని అన్నారు. ముందుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ పంట నష్టం జరిగిందని.. మళ్లీ అడిగితే వాతావరణం వల్లనే రైతులకు ఈ నష్టం వాటిల్లింది. అలాగే మరొకమారు మాట్లాడితే ఆయన దగ్గర ఉన్న రైతుతో అనుకూలంగా మాట్లాడిచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ రాజేంద్ర నగర్ నుంచి సైంటిస్ట్ లు వచ్చి ఫీల్డ్ విజిట్స్ చేసి వాతావరణం వల్లనే ఈ నష్టం జరిగిందని సొసైటీ అధికారి తెలిపారు. రైతు ఫోన్ వాయిస్ రికార్డులు, వీడియో ఆధారాల్లో తన ఆవేదనను వ్యక్తం చేశారు.

మూడు ఎకరాల సాగుకు నాలుగు బ్యాగుల విత్తనాలు కొనుగోలు చేశామని, దున్నకం, విత్తనాలు, ఎరువులు, కూలీ ఖర్చులు కలిపి మూడు ఎకరాలకు సుమారు రూ.50 వేల వరకు ఖర్చు అయినట్లు తెలిపారు. పంటను పరిశీలించిన సొసైటీ అధికారి వివరాలు అడిగేందుకు ప్రయత్నించగా.. సొసైటీ అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డితో రైతులు మాట్లాడాలని సూచించి వెళ్లిపోయినట్టు ఓ రైతు పేర్కొన్నారు. ఈ పంట నష్టంపై రైతులు సందేహాలు వ్యక్తం చేయడంతో సొసైటీ అధికారులు హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లర్స్ రిసెర్చ్ (IIMRC) శాస్త్రవేత్తలకు మెయిల్ ద్వారా సమాచారం అందించారు. శాస్త్రవేత్తలు గ్రామాల్లో ఫీల్డ్ విజిట్ నిర్వహించి పంట పరిస్థితిని పరిశీలించారు. పరిశీలనలో శాస్త్రవేత్తలు పంట నష్టం నేల కారణం కాదని, వాతావరణ ప్రభావమే ప్రధాన కారణమని స్పష్టం చేసిన‌ట్టు సొసైటీ అధికారి వెల్ల‌డించారు. తరువాత మాట్లాడితే డిసెంబర్ నెలలో కురిసిన మంచు పంట పుష్ప దశలో పరాగసంపర్కాన్ని దెబ్బతిని గింజలు సరిగా కట్టకుండా చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారని అదే అధికారి చెప్ప‌డం గ‌మ‌నార్హం. రైతులు మంచి లాభాల వస్తాయని ఆశతో జవార్ జొన్న సాగు చేసిన ఈసారి నిరాశే మిగిలింది. సొసైటీ విత్తనాలతో లాభాలు వస్తాయని భావించిన రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. మొత్తం 50 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో సుమారు రూ.68 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టాన్ని గుర్తించి ప్రభుత్వం తగిన పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. వీటిలో గ‌మ‌నించాల్సిన విష‌యం ఏంటంటే.. వ్య‌వ‌సాయ శాఖ అధికారి, రికార్డు సొసైటీ అధికారి ఒకే రైతు త‌న జ‌వార్ జొన్న పంట చేనులో ఆధారాలు సేక‌రించారు. ఇంత‌కీ సొసైటీ అధికారులు ఎలాంటి అనుమతులు, క్ర‌య విక్ర‌యాలు చేశార‌ని ఆరోపిస్తున్నారు. మొత్తానికి రైతుల‌ను మోసం చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి.త‌మ‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. .

Next Story