- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు మారాలి
మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వృత్తి నైపుణ్యాన్ని మరింత మెరుగుపరచుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వృత్తి నైపుణ్యాన్ని మరింత మెరుగుపరచుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ మీడియా అకాడమీ భవనంలో హనుమకొండ జిల్లా నూతన టీయూడబ్ల్యూజే కమిటీ ప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, కార్యదర్శి ఊటుకూరు సాయిరాం, కోశాధికారి విష్ణువర్ధన్‌లు మీడియా అకాడమీ చైర్మన్‌ను శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను అభినందించిన శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా కమిటీ ప్రతిపాదన మేరకు జిల్లాలో ఏఐ వినియోగంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.
హైదరాబాద్‌లో జర్నలిస్టులకు రెండు రోజులపాటు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో ఆసక్తి గల జర్నలిస్టులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా యూనియన్ కృషి చేయాలని సూచించారు. అనంతరం టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీని జిల్లా నాయకులు కలిశారు. ఆయన జిల్లా నాయకులను ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. యూనియన్‌పై ప్రతి సభ్యుడికి నమ్మకం కలిగే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. క్రమశిక్షణతో పని చేస్తూ సంఘం పటిష్టతకు కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి బోల్లారపు సదయ్య, కోశాధికారి అమర్, రాష్ట్ర నాయకులు గాడిపెళ్లి మధు, కంకణాల సంతోష్ పాల్గొన్నారు.






