- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు
గిరిజన సంక్షేమ శాఖా (ట్రెకార్), తెలంగాణ ప్రభుత్వం గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ

దిశ, మహబూబాబాద్ టౌన్ : గిరిజన సంక్షేమ శాఖా (ట్రెకార్), తెలంగాణ ప్రభుత్వం గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ వారితో కలిసి ఒక డిజిటల్ ప్లాట్ పామ్ ఏర్పాటు చేశారు. ఇట్టి డిజిటల్ ప్లాట్ ఫామ్ నిరుద్యోగులకు, ఉద్యోగం కల్పించే పరిశ్రమలకు ఒక వారధిగా పనిచేస్తుందని చేయనుంది. ఈ మేరకు సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ, ఏటురు నాగారం, ప్రాజెక్టు అధికారి నేడు ఒక ప్రకటనలో తెలిపారు.
దీని కోసం మహబూబాబాద్ జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులు వెబ్ సైట్:- http//deet.telangana.gov.in వెబ్ సైట్ లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని వెల్లడించారు. వారి విద్య అర్హతను బట్టి ఉద్యోగం కల్పించడానికి DEET app ను మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. రిఫరల్ కోడ్: JSETN అని టైపు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరని, తద్వారా దాదాపు 900 కంపెనీలలో ఉద్యోగావకాశాలు పొందుతారని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు దేశీరాం పేర్కొన్నారు.






