- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'జల్సా' ముఠా అరెస్ట్..! పగటి వేళ గస్తీ..రాత్రిళ్ళు దొంగతనం
నర్సంపేట నియోజక వర్గంలో తాళం వేసి ఉన్న ఇండ్లు లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న జల్సా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, నర్సంపేట: నర్సంపేట నియోజక వర్గంలో తాళం వేసి ఉన్న ఇండ్లు లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న జల్సా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి అరెస్టుకు సంబంధించి ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ , ఐ.పీ.ఎస్ నర్సంపేట పోలీస్ స్టేషన్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. వీరిపై నర్సంపేట డివిజన్ సహా పర్వతగిరి మండలంలో ఎనిమిది కేసులు నమోదైనట్లు తెలిపారు. ఖానాపురం మండలానికి చెందిన పుల్లూరి రాజేష్ ఇందులో ప్రధాన పాత్ర పోషించినట్లు డీసీపీ స్పష్టం చేశారు. చెడు అలవాట్లకు బానిసైన ఏడుగురు యువకులు తాము చేసే చిన్నాచితక పనులతో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతుండటంతో ఒక ముఠాగా ఏర్పడ్డారు.
వీరిలో ఖానాపురం మండలానికి చెందిన పుల్లూరి రాజేష్, ఎండీ. సుభాని సహా నర్సంపేటకు చెందిన వర్రేంకి. అక్షయ్ కుమార్, జెట్టి అక్షయ్, నీరుపెళ్లి సాయిరాం, మంకాల. ఉదయ్, అలువాల. విపిన్ లు ఉన్నారు. సులభంగా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా వీరందరూ ఏకమయ్యారు. ప్రధాన సభ్యుడైన రాజేష్ కి చెందిన ఆటో, ఎఫ్.జెడ్, విపిన్ కి చెందిన స్కూటీ పై పగటి వేళల్లో తిరుగుతూ తాళం వేసిన ఇండ్లను నిత్యం గుర్తించేవారు.
రాత్రి సమయాల్లో అదునుచూసి ఇంట్లోకి ప్రవేశించి బీరువా పగలగొట్టి దొంగతనాలకు పాల్పడేవారు. దొంగిలించిన బంగారు నగలను తెలివిగా రాజేష్ పేరుమీద, కొన్ని సుబాన్ పేరుమీద నర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్ వై్పున గల ముత్తూట్ ఫైనాన్స్ లో కుదువ పెట్టేవారు. వెండి నగలను గుర్తు తెలియని వ్యక్తులకు అమ్ముకుని వచ్చిన డబ్బులతో జల్సా చేసేవారు. వరుస దొంగతనాలపై అలెర్ట్ అయిన నర్సంపేట పోలీసులు విచారణ చేపట్టారు.
వీరిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. విపిన్ అనే యువకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. వీరి దగ్గర నుండి బంగారు, వెండి నగలు సహా ఒక ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక ల్యాప్ టాప్ సహా ఒక ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. 20 లక్షలు ఉన్నట్లు తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కి తరలిస్తున్నట్లు తెలిపారు. కేసులో ప్రతిభ కనబరిచిన నర్సంపేట ఎస్సై అరుణ్, కానిస్టేబుళ్లు రవి, నాగరాజు సహా మరో ఇద్దరిని డీసీపీ అభినందించారు.






