భార్య ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మైన భ‌ర్త‌కు జైలు శిక్ష

by Nallavelli.Anjaneyulu |

పెళ్లి జ‌రిగి ఏడు సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టడం లేదని నిత్యం భార్యను కొడుతూ చిత్ర హింసల పెడుతుండ‌టంతో భ‌రించ‌లేక భార్య క్రిమి సంహారక మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లి చ‌నిపోయింది.

భార్య ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మైన భ‌ర్త‌కు జైలు శిక్ష
X

దిశ, భూపాలపల్లి ప్రతినిధి : పెళ్లి జ‌రిగి ఏడు సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టడం లేదని నిత్యం భార్యను కొడుతూ చిత్ర హింసల పెడుతుండ‌టంతో భ‌రించ‌లేక భార్య క్రిమి సంహారక మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లి చ‌నిపోయింది. ఈ కేసులో నిందితుడికి భూపాలపల్లి అసిస్టెంట్ సెషన్స్ న్యాయమూర్తి ఏ.నాగరాజు ఇవాళ తీర్పు వెల్ల‌డించారు. ఈ కేసులో రెండు సంవత్సరాలు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.3000/- చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాదేవపూర్ మండలం, బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన అంబాల వెంకటయ్య తన కూతురు శైలజ ను అదే గ్రామానికి చెందిన కాల్వ రాజు ఇచ్చి2010లో పెళ్లి జరిపించారు. పెళ్లి జ‌రిగిన ఏడు సంవత్సరాలకు పిల్లలు కావడం లేదని భార్య శైలజను నిత్యం చిత్రహింసలు పెడుతుండేవాడు.

ఆ చిత్ర హింసలు భరించలేక శైలజ ఇంట్లో ఎవ్వ‌రూ లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగి అపస్మానిక స్థితిలోకి వెళ్లింది. అపస్మాక స్థితిలో ఉన్న శైలజను మహాదేవపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. మెరుగైన చికిత్స కోసం వైద్యుల సలహా మేరకు అదే రోజు ఎంజీఎం హాస్పిటల్ లో చేర్పించారు. చేర్పించిన కొద్ది సేప‌టికే శైలజ చనిపోవడం జరుగుతుంది. మహాదేవపూర్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, కేసులలో సమగ్రమైన దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులలో సమర్థవంతంగా వాదనలు వినిపించిన అడిషనల్ పబ్లిక్ పాసిక్యూటర్ ఎండి రఫిక్ , అప్పటి ఎస్ఎచ్ఒ బెల్లం సత్యనారాయణ పర్యవేక్షణలో కోర్టు లైజనింగ్ ఆఫీసర్ వెంకన్న, సీడీఓ సంపత్ రెడ్డి లు,సాక్షిని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో సమర్థవంతంగా పనిచేసిన అధికారులను జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిసెట్టి సంకీర్త్ ప్రత్యేకంగా అభినందించారు.

Next Story