- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్ : హైటెక్ సిటీ నిర్మాణాలపై అధికారుల చర్యలు..
ఈ నెల 17న “హైటెక్ మోసం” శీర్షికతో దిశ పత్రికలో ప్రచురితమైన కథనానికి జగ్గన్నపేట గ్రామ పంచాయతీ అధికారులు స్పందించారు. హైటెక్ సిటీ పేరిట సాగుతున్న వివాదాస్పద వెంచర్‌పై చర్యలు తీసుకుంటూ, అనుమతి లేకుండానే చేపట్టిన ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి అధికార నోటీసులు జారీ చేశారు.

దిశ, ములుగు ప్రతినిధి: ఈ నెల 17న “హైటెక్ మోసం” శీర్షికతో దిశ పత్రికలో ప్రచురితమైన కథనానికి జగ్గన్నపేట గ్రామ పంచాయతీ అధికారులు స్పందించారు. హైటెక్ సిటీ పేరిట సాగుతున్న వివాదాస్పద వెంచర్‌పై చర్యలు తీసుకుంటూ, అనుమతి లేకుండానే చేపట్టిన ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి అధికార నోటీసులు జారీ చేశారు.
గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వాతి తెలిపిన వివరాల ప్రకారం, హైటెక్ సిటీ పేరుతో నిర్మాణాలు చేపట్టిన ప్రైవేట్ డెవలపర్లు అవసరమైన అనుమతులు పొందకుండానే ఇండ్లు నిర్మిస్తున్నట్లు గుర్తించారు. గతంలోనూ వారిపై నోటీసులు జారీ చేసినా నిర్మాణం ఆగలేదని పేర్కొన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పూర్తి స్థాయి అనుమతులు పొందేవరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టరాదని హెచ్చరిస్తూ, వెంచర్ యాజమాన్యానికి పంచాయతీ అధికారులు మరోసారి నోటీసులు పంపారు.
స్థానికంగా హైటెక్ సిటీ పేరుతో జరుగుతున్న నిర్మాణాల చట్టబద్ధతపై ఇప్పటికే అనేక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో, అధికారుల తాజా చర్యను కీలకంగా భావించవచ్చు. అనుమతులు లేని స్థితిలో నిర్మాణాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు హెచ్చరిస్తూ, ప్రజలు ఇటువంటి ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టేముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలని సూచిస్తున్నారు.






