- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జఫర్ గడ్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం..
రైతులకు, గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతోనే సబ్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

దిశ లింగాలఘణపురం( జఫర్ గడ్) : రైతులకు, గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతోనే సబ్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం జఫర్ గడ్ మండలంలోని,సాగరం గ్రామంలో 2కోట్ల 29లక్షల వ్యయతో నిర్మించనున్న,33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయనమాట్లాడుతూ సబ్ స్టేషన్ నిర్మాణాన్ని 4 నెలలలో పూర్తి చేసి, సాగరం గ్రామ ప్రజలకు దసరా కానుకగా సబ్ స్టేషన్ ను అందుబాటులోకి తీసుకువస్తానని తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడా విద్యుత్ సమస్యలు తలెత్తకూడదన్నారు. విద్యుత్ శాఖ ద్వారా లో ఓల్టేజ్ సమస్యలు ఉన్న చోట, సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.త్వరలోనే గర్నేపల్లి, తిడుగు, సాగరం మీదుగా జఫర్ గడ్ రోడ్డు వరకు బీటి రోడ్డు మంజూరు చేస్తానాని తెలిపారు.
గ్రామంలో 30లక్షల అంతర్గత సిసి రోడ్లు మంజూరు చేస్తానని అన్నారు. గ్రామంలో 16ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యాయని, త్వరలోనే మరో 20ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 10ఏళ్ళు అధికారంలో ఉండి అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడినవారు, వేల కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములు సంపాదించుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18నెలలోనే, ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. వచ్చే3ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుంటుందని తెలిపారు. టిఆర్ఎస్ తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు.రైతులకు, ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించాలనే ఉదేశ్యంతో నియోజకవర్గంలో 33/11కేవి, 132/33 కేవి సబ్ స్టేషన్లు డివిజనల్ ఆఫీస్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమీటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి తహశీల్దార్ శంకరయ్య, ఎంపీడీవో సుమన్, విద్యుత్ శాఖ ఎస్ ఇ వేణుమాధవ్, డి ఈలు రాంబాబు, విజయకుమార్ పీఏసీఎస్ చైర్మన్ కర్ణాకర్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలయ్య , స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






