- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదు..
అభివృద్ధిని అడ్డుకోవడం సరైన పద్ధతి కాదు అని గోపాల్పూర్ ఊర చెరువు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్: అభివృద్ధిని అడ్డుకోవడం సరైన పద్ధతి కాదు అని గోపాల్పూర్ ఊర చెరువు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడి వరదలు వచ్చి కోట్లాది రూపాయలు ఆస్తి నష్టం జరిగితే అనేకసార్లు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోలేదని తమ బాధలు చూసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు చొరవ తీసుకొని ఊర చెరువు పూడికతీతతో పాటు రిటర్నింగ్ వాల్ నిర్మించేందుకు కృషి చేస్తుంటే మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సమాధుల పేరుతో ఆ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవితాలతో రాజకీయాలు చేయడం తగదని గోపాల్ ఊర చెరువు అభివృద్ధిపై వారికి చిత్తశుద్ధి ఉంటే రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి సహకరించి తమ చిత్తశుద్ధిని చాటుపోవాలన్నారు. సమాధులకు తాము వ్యతిరేకం కాదని తమలో తామకె విభేదాలు సృష్టించే ప్రయత్నం చేయొద్దని అన్నారు. ఇప్పటికైనా అభివృద్ధిని అడ్డుకోవడం మానుకొని అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వివేక్ నగర్ కాలనీ అధ్యక్షుడు మర్రి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి మీసాల రమేష్, సామాజిక కార్యకర్త తుపాకుల దశరథం, కోశాధికారి వినోద రావు, అమరావతి నగర్ అధ్యక్షుడు భీమ గాని యాదగిరి గౌడ్, నాయకులు రవీందర్ రావు, బోప్ప శివ శంకర్, నల్లని శ్రీనివాస్, బత్తుల సుదర్శన్ గౌడ్, డాక్టర్ సత్యనారాయణ, రమణారెడ్డి, దేవేందర్ రెడ్డి, జితేందర్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.






