- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలి
నియోజకవర్గ పరిధిలోని సాగునీటి పారుదల శాఖ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రు నాయక్ అధికారులను ఆదేశించారు.

దిశ, మరిపెడ : నియోజకవర్గ పరిధిలోని సాగునీటి పారుదల శాఖ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రు నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో నియోజకవర్గ పరిధిలోని ఇరిగేషన్ ఎస్ఈ , ఈఈ ఏడు మండలాల ఇరిగేషన్ డివిజనల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లతో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రతి పని పై క్షేత్రస్థాయి వివరాలు మండలాల వారీగా సాగుతున్న నీటి పారుదల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులకు గల అడ్డంకులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించి పనులు ప్రారంభించాలని సూచించారు. మంజూరైన నిధులను సద్వినియోగం చేస్తూ, పనుల్లో నాణ్యత పాటించాలని స్పష్టం చేశారు. రైతాంగానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా చెరువుల పునరుద్ధరణ, కాలువల మరమ్మతు పనులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పనులు ఆగిపోతే సహించేది లేదని, అటువంటి వారిపై నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఏడు మండలాల పరిధిలో ఏ ఒక్క గ్రామంలోనూ సాగునీటి సమస్య ఉండకూడదని, అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమీక్షలో ఏడు మండలాలకు చెందిన ఇరిగేషన్ డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.






